గణతంత్ర వైభవం
న్యూస్‌రీల్
సొసైటీ ఉద్యోగి ఆత్మహత్య
ద్వారకాతిరుమలలోని సొసైటీ పెట్రోల్ బంకులో గుమస్తాగా పనిచేస్తున్న ఉద్యోగి తీవ్ర ఒత్తిళ్లతో ఊరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. 8లో u
● ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు
● భీమవరంలో కలెక్టర్ పతాకావిష్కరణ
● అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
భీమవరం రైల్వే కాలనీలోని ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. సుమారు 13 కాసుల బంగారు ఆభరణాలు, నగదు దోచుకున్నట్టు తెలిసింది. 8లో u
మంగళవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 2026
భీమవరం: భీమవరం కలెక్టరేట్ ప్రాంగణంలోని పరేడ్ మైదానంలో 77వ గణతంత్ర దినోత్సవం అట్టహాసంగా నిర్వహించారు. సోమవారం కలెక్టర్ సీహెచ్ నాగరాణి జాతీయ జెండాను ఆవిష్కరించారు. సాయుధ దళాల గౌ రవ వందనం స్వీకరించారు. ప రేడ్ కమాండర్ ఆధ్వర్యంలో జిల్లా ఆర్మ్‌డ్ రిజర్వ్, సివిల్ మెన్, ట్రాఫిక్ కాంటింజెంట్, ఎస్‌టీఎఫ్ కాంటింజెంట్, విమెన్ కాంటింజెంట్, హోం గార్డ్స్ దళాలు గౌరవ వందనాన్ని స మర్పించారు. పతాకావిష్కరణ అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో గణతంత్ర రాజ్యాంగ ఆవిర్భావం ద్వారానే ప్రజలంతా సంపూర్ణ స్వేచ్ఛ, సమానత్వం, లౌకికత్వం, న్యాయం పూర్తిస్థాయిలో హక్కుగా పొందగలిగారన్నారు. జిల్లాలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సంతృప్తి స్థాయిలో అమలు చేస్తున్నామన్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రభుత్వ అభివృద్ధి, శకటాల ప్రదర్శనను ఆమె తిలకించారు.
స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలకు సత్కారం
స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబసభ్యులను కలెక్టర్ సత్కరించి ఉత్తమ సేవలందించిన ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, సంఘ సేవకులకు జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలను అందించారు. ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, జాయింట్ కలెక్టర్ టి. రాహుల్‌కుమార్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు పాక వెంకటసత్యనారాయణ, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రా మాంజనేయులు, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, డీఆర్వో బి.శివన్నారాయణరెడ్డి, ఆర్డీఓ కె.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
భళా.. సాంస్కృతిక హేళ
గణతంత్ర వేడుకల్లో పాఠశాల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. పీఎస్‌ఎం మున్సిపల్ స్కూల్ విద్యార్థుల ప్రదర్శనకు ప్రథమ, మోగల్లు జెడ్పీ స్కూల్‌కు ద్వితీయ, భారతీయ విద్యాభవన్స్ విద్యార్థులకు తృతీయ స్థానం లభించాయి.
శకటాల ప్రదర్శన : ప్రభుత్వ శాఖల శకటాల ప్ర దర్శన ఆకట్టుకుంది. వ్యవసాయ, వైద్య ఆరోగ్య, వి ద్య, మత్స్య, పశుసంవర్ధక, పౌరసరఫరాలు, అగ్నిమాపక తదితర శాఖలు శకటాలను ప్రదర్శించా యి. విద్యాశాఖ శకటానికి ప్రథమ, పౌరసరఫరాల శాఖకు ద్వితీయ, వైద్యారోగ్య శాఖ శకటానికి తృతీయ బహుమతి లభించాయి.
ఆకట్టుకున్న స్టాల్స్ : జిల్లాలో ప్రభుత్వ శాఖల ప్రగతి, పథకాలపై స్టాల్స్ ఏర్పాటుచేశారు. వ్యవసాయ శాఖ స్టాల్‌కు ప్రథమ, మత్స్యశాఖకు ద్వితీయ, మెప్మా లీడ్ బ్యాంకు స్టాల్ తృతీయ స్థానాల్లో నిలిచాయి.
గణతంత్ర వైభవం
గణతంత్ర వైభవం
గణతంత్ర వైభవం


