
గ్రంథాలయ ఉద్యోగుల జీతాలు చెల్లించాలి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రాష్ట్రంలో గ్రంథాలయ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులకు 010 పద్దు ద్వారా జీతాలు చెల్లించేలా ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని ఏపీ జేఏసీ జిల్లా చైర్మన్ చోడగిరి శ్రీనివాస్ స్పష్టం చేశారు. శుక్రవారం స్థానిక జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ సంస్థ ఉద్యోగుల సంఘం ఎన్నిక నిర్వహించారు. సంఘ అధ్యక్షుడిగా జీ. రాంబాబు, అసోసియేట్ అధ్యక్షుడిగా పీ రంగారావు, ఉపాధ్యక్షులుగా ఎస్.వెంకటేశ్వరరావు, ఎస్‌డీ.లతీఫ్, ప్రధాన కార్యదర్శిగా ఎండీ జుల్ఫికర్ అలీ, సహాయ కార్యదర్శిగా కొండే వెంకటేశులు, జిల్లా కోశాధికారి ఎన్‌సీహెచ్ రామకృష్ణ, కార్యవర్గ సభ్యులుగా ఎం.శోభ, జీ అనిత, బంగారు పాప ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముఖ్య అతిథులుగా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఎం.శేఖర్ బాబు, జేఏసీ రాష్ట్ర డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఆర్‌ఎస్.హరనాథ్, ఏపీ ఎన్‌జీఓ ఏలూరు తాలూకా అధ్యక్షుడు జీ శ్రీధర్ రాజు తదితరులు పాల్గొన్నారు.