అన్నదాతకు వెన్నుపోటు | - | Sakshi
Sakshi News home page

అన్నదాతకు వెన్నుపోటు

Aug 2 2025 7:22 AM | Updated on Aug 2 2025 7:22 AM

అన్నద

అన్నదాతకు వెన్నుపోటు

భీమవరం: రైతులకు అన్నివిధాలుగా అండగా ఉంటామని ప్రగల్భాలు పలికి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాతల సంక్షేమాన్ని విస్మరించింది కూటమి ప్రభుత్వం. రైతుల నుంచి కొను గోలు చేసి ధాన్యానికి సకాలంలో సొమ్ములు చెల్లించక తీవ్ర ఇక్కట్లు కలిగించిన సర్కారు.. తాజాగా అన్నదాత సుఖీభవ పథకంలో రైతుల సంఖ్యను గణనీయంగా తగ్గించింది. తాము అధికారంలోకి వస్తే రైతులకు ఏడాదికి రూ.20 వేల ఆర్థిక సాయం చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించిన కూటమి నాయకులు తొలి ఏడాది (2024–25) సాయానికి ఎగనామం పెట్టారు. ఏడాది కాలంలో రైతులకు ఎలాంటి సాయం అందించని ప్రభుత్వం శనివారం అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. అయితే జిల్లాలో గతంలో సాయం పొందిన రైతుల్లో 21 వేల మందిని అర్హుల జాబితా నుంచి కుదించింది.

గత ప్రభుత్వంలో పక్కాగా..

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఏటా వ్యవసాయ సీజన్‌ ప్రారంభంలో వైఎస్సార్‌ రైతు భరోసా కింద సాయం అందించారు. 2023–24లో జిల్లాలో 1,24,645 మంది రైతులకు సాయం అందగా.. తాజాగా అన్నదాత సుఖీభవ పథకం కింద సుమా రు 1.03 లక్షల మంది అర్హులుగా కూటమి ప్ర భుత్వం నిర్ధారించింది. ఈ లెక్కన జిల్లాలో సు మారు 21 మందికి సాయం అందకుండా పోనుంది. జిల్లాలో 20 మండలాల్లో సుమారు 2.20 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేస్తున్నారు.

రైతుల అప్పులబాట

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో సార్వా, దాళ్వా సీజన్ల ప్రారంభంలో పెట్టుబడి సాయం కింద నగదు అందించేవారు. దీంతో రైతులు ఆనందంగా సాగు ప్రారంభించేవారు. అయితే కూటమి ప్రభుత్వంలో ఇప్పటివరకూ సాయం అందించికపోవడంతో రైతులు అప్పులబాట పడుతున్నారు. దళారులు, వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తూ నష్టపోతున్నారు. దీనికి తోడు దాళ్వా సీజన్‌లో రైతుల నుంచి ప్రభు త్వం కొనుగోలు చేసిన ధాన్యానికి నెలల తరబడి సొమ్ములు చెల్లించకపోవడంతో రోడ్డెక్కి ఆందోళన లు చేశారు. ఓ పక్క సాయం అందించకపోగా.. సేకరించిన ధాన్యానికి సకాలంలో సొమ్ములు చెల్లించలేదంటూ రైతులు మండిపడుతున్నారు.

సార్వా నాట్ల ముగింపు దశలో..

జిల్లాలో రైతులు అవస్థల నడుమ ప్రస్తుత సార్వా సీ జన్‌లో నాట్లు పూర్తిచేస్తున్న తరుణంలో కేంద్ర ప్ర భుత్వం పీఎం కిసాన్‌ రూ.2 వేలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.5 వేలు కలిపి అన్నదాత సుఖీభవ పథకంలో జమచేస్తామని ప్రకటించింది. నారుమడులు, నాట్ల కోసం ఇప్పటికే అప్పులు చేశామని, సొమ్ములు అవ సరమైన సమయంలో ఇవ్వకుండా జాప్యం చేయడంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు జాబితా నుంచి సుమారు 21 వేల మందిని కుదించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కౌలు రైతులకు అమలు చేయాలి

అన్నదాత సుఖీభవ పథకంలో రైతుల సంఖ్య తగ్గించడం దారుణం. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చి ఏడాది గడిచిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలుకు శ్రీకారం చుట్టడం రైతులకు అన్యాయం చేయడమే. అన్నదాత సుఖీభవ పథకాన్ని కౌలు రైతులకూ అమలు చేసి వారిని ఆదుకోవాలి.

– ఎం.రామాంజనేయులు, ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి

కోతల కూటమి

అన్నదాత సుఖీభవ పథకంలో 21 వేల మంది రైతులకు కోత

గతేడాది లబ్ధికి ఎగనామం

రైతులందరికీ రూ.20 వేలు ఇస్తామని ఎన్నికల్లో హామీ

ఇప్పుడు కేంద్రం ఇచ్చే రూ.6 వేలతో కలిపి రూ.20 వేలని మెలిక

కౌలు రైతులకు పథకాన్ని వర్తింపజేయాలని డిమాండ్‌

సాయంలో మెలిక

టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికలకు ముందు ఉమ్మడి మేనిఫెస్టోలో సూపర్‌సిక్స్‌లో భాగంగా అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకూ ఏడాదికి రూ.20 వేలు చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.6 వేలతో కలిపి రూ.20 వేలు ఇస్తామంటూ మెలిక పెట్టారు. దీనిపై రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

అన్నదాతకు వెన్నుపోటు 1
1/1

అన్నదాతకు వెన్నుపోటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement