
పెట్రోల్‌లో నీరు కలిసిందంటూ..
తణుకు అర్బన్ : ద్విచక్ర వాహనంలో పెట్రోలు పో యించుకుంటే ట్యాంకు నుంచి నీళ్లు బయటపడ్డా యంటూ బాఽధితులు పెట్రోలు బంక్ వద్ద ధర్నా చే శారు. తణుకుకు చెందిన ఫణి, శంకర్ అనే యు వకులు శుక్రవారం స్థానిక హెచ్‌పీసీఎల్‌కు చెందిన తుమ్మలపల్లి పాపారావు బంకు వద్ద తమ వాహనంలో రూ.60లు పెట్రోలు పోయించుకున్నారు. కొద్ది దూరం వెళ్లగానే వాహనం మోరాయించడంతో తిరి గి బంకులోకి వచ్చి యజమానితో మాట్లాడి వా హనం ట్యాంకులోని పెట్రోల్‌ను బయటకు తీయించగా పెట్రోల్‌తోపాటు నీరు బయటపడటంతో అ వాక్కయ్యారు. దీంతో పాతవూరుకు చెందిన యువకులు భారీ సంఖ్యలో బంకు వద్దకు చేరి నిరసన తెలిపారు. పట్టణ ఎస్సై శ్రీనివాస్ వెళ్లి పరిస్థితిని చక్కదిద్దారు. వాహనంలోని పెట్రోల్ ట్యాంకు నుంచి పెట్రోల్ బయటకు తీయిస్తే సగానికి పైగా నీరు వచ్చిందని, దీనిపై అడిగితే బంకు యజమాని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని బాధితులు అన్నారు. దీంతో ఆందోళనకు దిగినట్టు యువకులు చెప్పారు. విషయం తెలిసి డిప్యూటీ తహసీల్దార్ శ్రీదేవి బంకు వద్దకు వచ్చి పరీక్షలు జరిపారు. బంకులో నిల్వ ఉన్న పెట్రోల్‌లో ఎలాంటి నీటి ఆనవాళ్లు లేవని, డెన్సిటీ పరీక్షలతో పాటు సాంకేతిక పరీక్షల్లో ఈ విషయం తేలిందన్నారు.