
ఎస్సీ వర్గీకరణపై మండిపాటు
భీమవరం: ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ భీమవరం అంబేడ్కర్ సెంటర్‌లో శుక్రవారం మాల సంఘాల జేఏసీ అధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నల్లి రాజేష్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణతో మాల సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. మాలలు అన్ని రంగాల్లో అవకాశాలు కోల్పోతున్నారని చెప్పారు. జాతీయ కన్వీనర్ చీకటిమిల్లి మంగరాజు మాట్లాడుతూ మాలలకు వ్యతిరేకంగా పనిచేసే రాజకీయ పార్టీలకు తగిన గుణపాఠం చెబుతామన్నారు. మాల సంఘాల జేఏసీ కన్వీనర్ గంటా సుందరకుమార్ మాట్లాడుతూ అక్టోబర్ 3న కుప్పం నుంచి మాల సంఘాల ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర నిర్వహిస్తున్నామని, దీనిని మాల సంఘాల నాయకులు, సభ్యులు విజయవంతం చేయాలని కో రారు. మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు గుండె నగేష్, సోడదాసి జయపాల్, కొండేటి లాజర్, వర్ధనపు మోషే, పెట్టెం శుభాకర్, కర్ని జోగయ్య, ఉన్నమట్ల శామ్యూల్‌రాజ్, పరువు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.