జైళ్ల శాఖ పెట్రోల్‌ బంక్‌ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

జైళ్ల శాఖ పెట్రోల్‌ బంక్‌ ప్రారంభం

Aug 2 2025 7:22 AM | Updated on Aug 2 2025 7:22 AM

జైళ్ల

జైళ్ల శాఖ పెట్రోల్‌ బంక్‌ ప్రారంభం

భీమవరం : పట్టణంలోని వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌ సమీపంలో ఆధునికీకరించిన సబ్‌ జైలు, జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పెట్రోల్‌ బంక్‌లను శుక్రవారం జైళ్ల శాఖ డీజీపీ అంజన్‌కుమార్‌ ప్రారంభించారు. అనంతరం సబ్‌ జైల్‌ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట ఎస్పీ అద్నాన్‌నయీం అస్మి, ఏఎస్పీ వి.భీమారావు, డీఎస్పీ ఆర్‌జీ జయసూర్య, వన్‌టౌన్‌ సీఐ ఎం.నాగరాజు ఉన్నారు.

సర్పంచ్‌ వేధిస్తున్నారంటూ ఫిర్యాదు

ఉండి: గ్రామ సర్పంచ్‌ తనను వేధిస్తున్నారంటూ ఉప్పులూరు గ్రామంలో ఓ మహిళ శుక్రవారం డిప్యూటీ స్పీకర్‌ కనుమూరు రఘురామకృష్ణరాజు వద్ద మొరపెట్టుకుంది. పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి వచ్చిన ఆయన వద్ద తన బాధ చెప్పుకుంది. గ్రామ సర్పంచ్‌, జనసేన నేత యర్రా దుర్గారావు చాలాకాలం నుంచి తనను బాధలు పెడుతున్నారని, న్యాయం చేయాలని ఆమె వేడుకుంది. దీంతో స్పందించిన డిప్యూటీ స్పీకర్‌ ఎస్సై ఎండీ నసీరుల్లాను పిలిచి ఆమెకు న్యాయం చేయాలని ఆదేశించారు. దీనిపై సర్పంచ్‌ దుర్గారావును వివరణ కోరగా ఆమె చెప్పేవన్నీ అబద్ధాలని, ఆమె ఆ రోపణల్లో నిజం లేదన్నారు. పోలీసుల విచారణలో నిజాలు తెలుస్తాయన్నారు.

పక్కాగా భూ సర్వే

భీమవరం(ప్రకాశంచౌక్‌): ప్రభుత్వ భూములకు సంబంధించి ఒక్క సెంటు కూడా తగ్గకుండా సర్వే నిర్వహించాలని ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ప్రభుత్వ భూముల రీ సర్వేపై అధికారులతో సమీక్షించారు. జిల్లాలోని 293 గ్రామాలకు సంబంధించి 194 గ్రామాల్లో రీ సర్వే పనులను నెలాఖరుకు పూర్తిచేయాలన్నారు. మిగిలిన 72 గ్రామాల్లో ప్రభుత్వ భూములను సర్వే చేసి నిర్ధారణ చేయాలన్నారు. ఆ గ్రామాల్లో 24,474 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయన్నారు. డీఆ ర్వో ఎం.వెంకటేశ్వర్లు, జిల్లా సర్వే అధికారి కె.జాషువా తదితరులు పాల్గొన్నారు.

ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉపాధ్యాయుల నుంచి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తు లు ఆహ్వానిస్తున్నట్టు ఏలూరు డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్‌ 5న సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి సందర్భంగా అవార్డుల వేడుక నిర్వహించనున్నారని, ఈనెల 8వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు.

పింఛన్ల పంపిణీలో వివాదం

కొట్టుకున్న ‘తెలుగు’ తమ్ముళ్లు

నూజివీడు: పింఛన్ల పంపిణీలో జరిగిన వాగ్వి వాదం ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఇరువర్గాల వారు కొట్టుకున్నారు. అనంతరం పోలీసులకు ఫిర్యా దు చేశారు. దీనికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి. నూజివీడు మండలం యనమదల శివారు రేగుంటలోని ఇద్దరికి స్పౌజ్‌ పింఛన్లు మంజూరయ్యాయి. దీంతో వాటిని లబ్ధిదారులకు అందించేందుకు శుక్రవారం టీడీపీ గ్రామ అధ్యక్షుడు బొల్లిగొర్ల నాగరాజు, గ్రామ సచివాలయ వెల్ఫేర్‌ సెక్రటరీ షహీన, గ్రామంలోని పలువురు టీడీపీ నాయకులు వచ్చారు. అయితే.. అదే గ్రామానికి చెందిన టీడీపీ నా యకుడు సూదిలకుంట సుబ్రహ్మణ్యం అభ్యంతరం వ్యక్తం చేశాడు. గ్రామానికి చెందిన టీడీ పీ నాయకుడు జోషి లేకుండా పింఛన్లు ఎలా ఇస్తారని నిలదీశాడు. మంజూరైన రెండు పింఛన్లను దరఖాస్తు చేయించింది జోషినే కాబట్టి ఆయన అందుబాటులో లేనందున సాయంత్రం ఆయనొచ్చాక ఇవ్వాలని స్పష్టం చేశాడు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య గొడవ జరిగి బాహాబాహీకి దిగారు. ఈ ఘర్షణలో గాయపడిన సుబ్రహ్మణ్యం స్థానిక ఏరియా ఆస్పత్రిలో చేరి.. కోమవరపు దేవదాసు, కోమవరపు సు రేంద్ర, కోమవరపు మనోజ్‌ తనపై దాడి చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరోపక్క కోమవరపు దేవదాసు కూడా ఆస్పత్రిలో చేరి పింఛన్లను పంపిణీ చేస్తుంటే సూదిలకుంట సుబ్రహ్మణ్యం, ఆయన కుమారులు అజయ్‌బాబు, వరుణ్‌బాబు తనపై దాడి చేసి కొ ట్టారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘ టన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

జైళ్ల శాఖ పెట్రోల్‌ బంక్‌ ప్రారంభం 1
1/1

జైళ్ల శాఖ పెట్రోల్‌ బంక్‌ ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement