
నిలదీద్దాం.. నిలబడదాం
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి
పాలకొల్లు సెంట్రల్: ఎన్నికల సమయంలో హామీలిచ్చి అధికారం చేపట్టిన తర్వాత ప్రజలను మోసం చేసిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు అన్నారు. శుక్రవారం స్థానిక లయన్స్ క మ్యూనిటీ హాలులో వైఎస్సార్‌సీపీ మండల కన్వీన ర్ పెన్మెత్స ఏసురాజు అధ్యక్షతన బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీపై పాలకొల్లు మండల విస్తృత స్థా యి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జి ల్లా అధ్యక్షుడు ప్రసాదరాజు మాట్లాడుతూ అధికారంలో ఉంటే కేసులతో భయపెట్టి పోలీసులతో పాలన చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. అక్రమ కేసులు బనాయించి జైలు లో పెట్టినా ప్రజాపక్షాన పోరాటం చేసి విజయం సాధించిన గుండె వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిది అని అన్నారు. వైఎస్సార్‌సీపీ అంటే జగనన్న సైన్యం అని, కేసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. పార్టీలో కష్టపడే కార్యకర్తలకు అగ్రపీఠం ఉంటుందని, ఇది జగన్ పంపించిన సందేశం అన్నారు.
వంచనపై పోరాడుదాం
కూటమి నాయకుల మోసపూరిత హామీలపై ఇంటింటా నిలదీయాలని ముదునూరి పిలుపునిచ్చా రు. కూటమి నేతలు సూపర్ సిక్స్ అని చెప్పి సూ పర్ ప్లాప్ చేశారన్నారు. రైతులకు రూ.20 వేలు, ఆడబిడ్డ నిధి, ఉచిత బస్సు, నిరుద్యోగ భృతి, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పుడు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో 68.50 లక్షల మందికి సామాజిక పింఛన్లు ఇస్తే నేడు కూటమి ప్ర భుత్వంలో 60.50 లక్షల మందికే ఇస్తున్నారన్నారు. ఇంటింటికీ వచ్చే చౌక డిపోను దూరం చేశారని మండిపడ్డారు. ఏడాది కాలంలో ప్రజలపై రూ. 18,500 కోట్ల విద్యుత్ భారం మోపారన్నారు. ఆ రోగ్యశ్రీ అడ్రస్ లేకుండా పోయిందన్నారు. రైతుల కు రూ.6,500 కోట్ల బకాయిలు పడ్డారన్నారు. సు మారు 2.80 లక్షల మంది వలంటీర్లను తొలగించారని, వీటన్నింటిపై సీఎం చంద్రబాబుతో పాటు నియోజకవర్గంలోని మంత్రి సమాధానం చెప్పాల ని డిమాండ్ చేశారు. ఇప్పుడు కూటమి నేతలు తొలిఅడుగు అంటూ సిగ్గులేకుండా ప్రజల ముందుకు వస్తున్నారన్నారు. తల్లికి వందనం ప్రచారం హోరెత్తిపోతుందని కానీ ఈ పథకం అందని ప్రజల ఫొటోలు కూడా వేస్తే వారి నిబద్ధత ఏపాటిదో అర్థమవుతుందని ముదునూరి అన్నారు. ఎమ్మెల్సీ కవు రు శ్రీనివాస్, ఇన్‌చార్జి గుడాల శ్రీహరిగోపాలరావు, నాయకులు గుణ్ణం నాగబాబు, చెల్లెం ఆనందప్రకాష్, కుమారదత్తాత్రేయ వర్మ, జెడ్పీటీసీ నడపన గోవిందరాజులు నాయుడు తదితరులు పాల్గొన్నారు.