
విద్యుత్ సంస్థలో పదోన్నతులు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏపీఈపీడీసీఎల్ ఏలూరు ఆపరేషన్ సర్కిల్ పరిధిలోని పలువురు సీనియర్ అసిస్టెంట్లకు జూనియర్ అక్కౌంట్స్ అధికారులుగా పదోన్నతులు కల్పిస్తూ ఎస్‌ఈ పి.సాల్మన్ రాజు ఉత్తర్వులు జారీ చేశారు. పాలకొల్లు ఈఆర్‌ఓలోని ఎల్‌బీవీ సాంబశివరావును భీమవరానికి పదోన్నతిపై బదిలీ చేశారు. ఏలూరు సర్కిల్ కార్యాలయంలోని వై.శ్రీనివాసరావును ఏలూరు సర్కిల్ కార్యాలయంలో ఎల్‌టీ విభాగానికి బదిలీ చేశారు. భీమవరం ఈఆర్‌ఓలోని పీఆర్‌కేవీ ప్రసాద్‌ను నరసాపురం డివిజన్ అక్కౌంట్స్ కార్యాలయానికి బదిలీ చేశారు. ఏలూరు కనస్ట్రక్షన్స్ విభాగంలోని వి.రాజశేఖర్‌ను ఏలూరు సర్కిల్ కార్యాలయంలోని సీఏఎస్ విభాగానికి బదిలీ చేశారు. తణుకు డీ1లోని కె.రవీంద్రనాథ్‌ను తాడేపల్లిగూడెం అక్కౌంట్స్ డివిజన్ కార్యాలయానికి, భీమవరం డివిజన్ కార్యాలయంలోని జి.రామకృష్ణ రాజును భీమవరం సర్కిల్ కార్యాలయానికి బదిలీ చేశారు. ఏలూరు సర్కిల్ కార్యాలయంలోని కేవీఆర్‌జీ కృష్ణమూర్తిని అదే కార్యాలయానికి, నరసాపురం డివిజన్ కార్యాలయంలోని ఎస్‌డీ ఆశీర్వాదంను అదే కార్యాలయంలో ఏడీఎం విభాగానికి, ఏలూరు ఈఆర్‌ఓలోని ఎస్.వెంకటేశ్వరరావును ఏలూరు డివిజన్ కార్యాలయానికి, పెరవలి సెక్షన్ కార్యాలయంలోని ఎ.శ్రీనివాసరావును జంగారెడ్డిగూడెం అక్కౌంట్స్ కార్యాలయానికి బదిలీ చేశారు. నిడదవోలు ఈఆర్‌ఓలోని ఎండీ అబ్దుల్ అలీంను నిడదవోలు డివిజన్ కార్యాలయానికి, ఉండ్రాజవరం సెక్షన్ కార్యాలయంలోని కేవీపీ విజయకుమార్‌ను జంగారెడ్డిగూడెం ఈఆర్‌ఓకు, తంగెళ్లమూడి ఈఆర్‌ఓలోని కె.పద్మజను అదే కార్యాలయానికి జూనియర్ అక్కౌంట్స్ అధికారిగా పదోన్నతి కల్పించారు. అలాగే తణుకు ఈఆర్‌ఓలోని కె.బాలకృష్ణకు జూనియర్ అక్కౌంట్స్ అధికారిగా పదోన్నతి కల్పిస్తూ తాడేపల్లిగూడెం డివిజన్ కార్యాలయంలో పోస్టింగ్ ఇచ్చారు. అయితే పరిపాలనా సౌలభ్యం కోసం ఆయన్ను భీమవరం ఈఆర్‌ఓకు బదిలీ చేశారు.