
కూటమి మోసాలను ఎండగడదాం
భీమవరం అర్బన్: ఎన్నికల సమయంలో ఎడాపెడా హామీలిచ్చి తీరా గద్దెనెక్కిన తర్వాత మొహం చాటేస్తున్న చంద్రబాబు వంచన పాలనను తిప్పికొడదామని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు పిలుపునిచ్చారు. గురువారం మండలంలోని కొత్తపూసలమర్రులో పార్టీ మండల అధ్యక్షుడు జల్లా కొండయ్య అధ్యక్షతన బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా మండల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రసాదరాజు మాట్లాడుతూ చంద్రబాబుకు ఓటేసిన ప్రతిసారీ ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారని, సూపర్‌సిక్స్ అంటూ మ రోసారి బాబు మోసం చేశాడని మండిపడ్డారు. సంపద సృష్టిస్తానని చెప్పి ఏడాది పాలనలో రూ.1.60 లక్షల కోట్లు అప్పులు చేశారని విమర్శించారు. అలాగే రాష్ట్రంలో వలంటీర్లు, ఎండీఎం డ్రైవర్లు, మద్యం షాపుల్లో సిబ్బంది ఇలా సుమారు 3 లక్షల మంది ఉద్యోగాలు పీకేశారన్నారు. నిరుద్యోగ భృతి నెలకు రూ.3 వేలు ఇస్తామని మోసం చేశారన్నారు. అలాగే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత 8.58 లక్షల పింఛన్లను రద్దు చేసిందని ధ్వజమెత్తారు. ఉచిత బస్సు, ఆడబిడ్డ నిధి, రైతులకు అన్నదాత సుఖీభవ పథకాలు అమలు చేయలేదన్నారు. పేదలకు ఆరోగ్యశ్రీ అందకుండా రూ.4,500 కోట్ల బకాయిలు పెట్టారన్నారు.
ఇంటింటా నిలదీత
నరసాపురం పార్లమెంటరీ పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణంరాజు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్‌లు సంతకాలు పెట్టి బాండ్ పేపర్లు ఇచ్చారని, వీటిపై కూటమి నాయకులను ప్రజలు ప్రశ్నిస్తున్నారన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పార్టీ శ్రేణులంతా సిద్ధంగా ఉండాలని, జగన్‌ను మరోసారి ముఖ్యమంత్రి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
కూటమి ప్రభుత్వంలో వందల కోట్లు వృథా
ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులకు ధాన్యం సొమ్ములు జమచేయకుండా చంద్రబాబు ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందన్నారు. యోగాంధ్ర, పేరెంట్స్ కమిటీ సమావేశాల పేరుతో వందల కోట్లు ఖర్చు పెట్టారని దుయ్యబట్టారు. భీమవరం నియోజకవర్గ సమన్వయకర్త చినమిల్లి వెంకట్రాయుడు మాట్లాడుతూ గ్రామస్థాయి వరకూ పార్టీని పటిష్టం చేస్తున్నారని, పార్టీలో కష్టపడే వారికి సముచిత స్థానం లభిస్తుందన్నారు. చంద్రబాబు మోసపూరిత పాలనను ఇంటింటా వివరించాలన్నారు. మాజీ సీఎం జగన్ పర్యటనలతో కూటమి నాయకులు ఉలిక్కి పడుతున్నారని, అడుగడుగునా ఆంక్షలు విధిస్తున్నారన్నారు. ఎంపీపీ పేరిచర్ల విజయ నరసింహరాజు, జెడ్పీటీసీ కాండ్రేగుల నరసింహరావు, జిల్లా సోషల్ మీడియా విభాగ అధ్యక్షుడు బందన పూర్ణచంద్రరావు, జిల్లా మహిళా విభాగ అధ్యక్షురాలు కోడే విజయలక్ష్మి, జిల్లా యూత్ విభాగ అధ్యక్షుడు చిగరుపాటి సందీప్, నాయకులు మేడిది జాన్సన్, ఏఎస్ రాజు, కామన నాగేశ్వరరావు, పట్టణ కన్వీనర్ గాదిరాజు రామరాజు, ఎంపీటీసీ తిరుమాని తులసీరావు, వైస్ ఎంపీపీ తిరుమాని ధనంజయరాజు తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి