
సాక్షి, పశ్చిమ గోదావరి: దెందులూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే చింతమనేని భయానక వాతావరణ సృష్టించారని అన్నారు వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి. చింతమనేని ప్రభాకర్ బెదిరింపులకు భయపడేవాడెవారు ఎవరూ లేరు.. తప్పుడు కేసులు పెడితే కోర్టులో మొట్టికాయలు వేసినా వీరికి బుద్ధి రావడం లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే, దెందులూరు నియోజకవర్గంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి టార్గెట్‌గా చింతమనేని రాక్షస క్రీడకు తెరలేపారు. అబ్బయ్య చౌదరికి చెందిన పంట పొలాలను పచ్చ మూకలు ధ్వంసం చేసి.. వక్క చెట్లను నరుక్కు పోయారు. అంతటితో ఆగకుండా.. అబ్బయ్య చౌదరి ఇంటి ముందు టీడీపీ శ్రేణులు వంటావార్పుకి పిలుపునిచ్చారు. దీంతో, దెందులూరు నియోజకవర్గం కొండలరావు పాలెంలో పోలీసులు భారీగా మోహరించారు. ఈ నేపథ్యంలో అబ్బయ్యచౌదరి నివాసానికి వైఎస్సార్‌సీపీ శ్రేణులు చేరుకున్నారు.
ఈ క్రమంలో దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘దెందులూరు నియోజకవర్గంలోకి అబ్బయ్య చౌదరి వచ్చాడంటే చాలు ఉలిక్కిపడుతున్నారు. టీడీపీ నేతలకు అధికారం ఇచ్చింది దేనికి?. ప్రజలకు మంచి చేయడానికా లేక అబ్బయ్య చౌదరిని టార్గెట్ చేయడానికా?. దెందులూరులో వైఎస్సార్‌సీపీ నేతల ఆస్తులను టార్గెట్ చేస్తున్నారు. చింతమనేని మేము చేసిన అభివృద్ధిలో సంక్షేమంతో పోటీ పడండి.. అంతేకానీ కక్షపూరిత రాజకీయాలు కాదు.
దెందులూరు నియోజకవర్గంలో చింతమనేని భయానక వాతావరణ సృష్టించారు. చింతమనేని బెదిరింపులకు భయపడేవారు ఎవరూ లేరు. తప్పుడు కేసులు పెడితే కోర్టులో మొట్టికాయలు వేసినా వీరికి బుద్ధి రావడం లేదు. ఏదో ఒక వంక పెట్టుకుని వచ్చి భయపెట్టాలని చూస్తున్నారు. మాజీ శాసనసభ్యుడి ఇంటి ముందు ఇలా చేయడం ఏంటి?. మేము ఎక్కడికి పారిపోవటం లేదు ఇక్కడే ఉన్నాం.. ఏం చేస్తారో చేయండి?. దుర్మార్గమైన నీచమైన సంస్కృతికి తెర లేపారు. మా తోటలో వక్క చెట్లు నరుక్కుని పోయే బ్యాచులు తయారయ్యారు. అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు అంటూ వ్యాఖ్యలు చేశారు.