ఆకివీడు: స్థానిక గుమ్ములూరు సెంటర్‌లో పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలోని ఎస్ బీఐ ఏటీఎంను మద్యం మత్తులో ఓ వ్యక్తి ధ్వంసం చేశాడు. బుధవారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో తాగిన మైకంలో ఏటీఎం గది అద్దాలను గుద్దుకుంటూ లోనికి వెళ్లాడు. గురువారం ఉదయం ఏటీఎం నగదు డ్రా చేసే కింది భాగంలో డోర్ తెరిచి ఉంది. దీంతో రూరల్ సీఐ జగదీశ్వరరావు సంఘటనా స్థలాన్ని, సీసీ పుటేజ్‌లను పరిశీలించారు. ఏటీఎంలో డబ్బు భద్రంగా ఉందని తెలిపారు.
క్లోరినేషన్ చేసి నీరు సరఫరా
ఆకివీడు: మండలంలోని అప్పారావుపేట గ్రామంలో క్లోరినేషన్ చేసి తాగునీటిని కుళాయిల ద్వారా సరఫరా చేస్తున్నామని గ్రా మ కార్యదర్శి బి.సతీష్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ‘సమస్యల వలయంలో అప్పారావుపేట’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురించిన కథనానికి ఆయన స్పందించారు. ప్రతినెలా రక్షిత మంచినీటి పథకాన్ని శుభ్రం చేయిస్తున్నామన్నారు. అప్పారావుపేట–గుమ్ములూరు రోడ్డు కు నాబార్డు (ఆర్‌ఐడీఎఫ్) నిధులు మంజూరు అయ్యాయని పనులు జరగాల్సి ఉందన్నారు. 2.50 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణానికి రూ.1.60 కోట్లు విడుదలయ్యాయని చెప్పారు. ఉపాధి హామీ నిధులతో డ్రెయిన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు.
జూనియర్ కాలేజీల్లో ప్రవేశాల గడువు పెంపు
భీమవరం: ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఈనెల 11 వరకు గడువు పొడిగించినట్టు జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖ అధికారి జి.ప్రభాకరరావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల్లో గతేడాది 1,410 మంది చేరగా ఈ ఏడాదిలో 1,618 మంది ప్రవేశాలు పొందారన్నారు. ప్రభుత్వం ఇంటర్మీడియె ట్ విద్యార్థులకు తల్లికి వందనం, టెస్ట్, నోట్‌బు క్స్, మధ్యాహ్నం భోజన పథకంతోపాటు విద్యార్థులకు పోషకాహారం కోసం చిక్కీలు, రాగి జావ అందిస్తున్నట్టు చెప్పారు.
ఉపాధ్యాయులకు అన్యాయం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): విద్యారంగంలో ప్రభు త్వం తీసుకుంటున్న అసంబద్ధ నిర్ణయాలతో జిల్లా పరిషత్, మండల పరిషత్ ఉపాధ్యాయులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఏపీటీఎఫ్ 1938 రాష్ట్ర అకడమిక్ కమిటీ కన్వీనర్ గుగులోతు కృష్ణ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చేరిన ఉపాధ్యాయులకు మాత్రమే ఎంఈఓ, డీవైఈఓలుగా బాధ్యతలు అప్పగిస్తామని అధికారులు ఎలా నిర్ధారిస్తారని ప్రశ్నించారు. జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ యాజమాన్యాల్లో పనిచేసే ఉపాధ్యాయులపై ప్రభుత్వ ఉపాధ్యాయుల పెత్త నం ఏంటని ప్రశ్నించారు. ఉమ్మడి సర్వీసు రూల్స్‌కు సంబంధించి 72, 73, 74 జీఓల అమలులో పక్షపాత వైఖరి సరికాదన్నారు. వెంటనే ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకుని ఉమ్మడి సీనియార్టీ ద్వారా మాత్రమే ఎంఈఓ–1 పోస్టులను భర్తీ చేయా లని డిమాండ్ చేశారు.
రిజిస్ట్రేషన్ ఆదాయంలో ఫస్ట్
నూజివీడు: ఏలూరు జిల్లాలోని 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ద్వారా రూ.548.80 కోట్ల రెవెన్యూతో రాష్ట్రంలోనే అత్యధిక ఆదాయాన్ని సాధించినట్టు ఏలూరు జిల్లా రిజిస్ట్రార్ కొమ్మి నేని శ్రీనివాసరావు తెలిపారు. గురువారం నూ జివీడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే నూజివీడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం 80 శాతం వృద్ధి సాధించిందన్నారు.
రిజిస్ట్రేషన్ విధానంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణల్లో భాగంగా కార్డ్ ప్రైమ్ 2.0 విధానంలో రిజిస్ట్రేషన్ జరిగిన రోజే డాక్యుమెంట్‌ను యజమానికి అందిస్తున్నామన్నారు. ఆగస్టు 1 నుంచి రిజిస్టర్ డాక్యుమెంట్ కాపీని యజమానికి వా ట్సాప్ ద్వారా అందిస్తామన్నారు. ఏలూరు కా ర్పొరేషన్ పరిధిలో కార్డ్ ప్రైమ్ 2.0ను మున్సి పల్ పరిపాలన విభాగంతో అనుసంధానం చే సి, అర్బన్ పరిధిలో ఉన్న ఆస్తులను మ్యూటేష న్ చేసి యజమాని మార్పిడి జరుగుతుంద న్నారు. ఏలూరు, వట్లూరు సబ్ రిజిస్ట్రార్ కా ర్యాలయాల్లో ప్రారంభిస్తామన్నారు.

మద్యం మత్తులో ఏటీఎం ధ్వంసం