అరాచకాలు.. దౌర్జన్యాలు
ఆదివారం శ్రీ 8 శ్రీ జూన్ శ్రీ 2025
సాక్షి, భీమవరం: ఎన్నికల హామీలను గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వం రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడమే లక్ష్యంగా పనిచేస్తోంది. పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు వైఎస్సార్‌సీపీ నేతలు, సోషల్ మీడియా కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. ఏడాది పాలనలో సూపర్ సిక్స్ హామీలు, ప్రజా సంక్షేమాన్ని విస్మరించి పాలన సాగిస్తోంది. ప్రజల గొంతుకగా ప్రశ్నిస్తున్న వారిని వేధింపులకు గురిచేస్తోంది. జిల్లాలోని దాదాపు 37 మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు, పలువురు సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించింది. కూటమి నేతలు ఆడింది ఆట పాడింది పాటగా మారింది. కూటమి ప్రభుత్వం వచ్చాక జిల్లాలోని భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు పట్టణాలు పేకాట స్థావరాలకు నిలయంగా మారాయన్న విమర్శలు ఉన్నాయి. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి పోలీసులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారంటున్నారు.
పదవుల కోసం కుతంత్రాలు
ఇటీవల అత్తిలి ఎంపీపీ ఎన్నిక సందర్భంగా కూటమి కుట్ర రాజకీయాలు బయటపడ్డాయి. అత్తిలి మండలంలో 19 ఎంపీటీసీ స్థానాలకు వైఎస్సార్‌సీపీకి 13 సభ్యుల సంఖ్యాబలం ఉండగా, కూటమికి ఆరుగురే ఉన్నారు. ఎన్నికలు సవ్యంగా జరిగితే ఎంపీపీ, వైస్ ఎంపీపీలుగా వైఎస్సార్‌సీపీ సభ్యుల ఎన్నిక లాంఛనమే. కాగా కుట్ర రాజకీయాలతో పదవులు కాజేసే ఎత్తుగడ చేశారు. మెజార్టీకి అవసరమైన సభ్యులను తమ వైపు తిప్పుకోవడం ద్వారా విలువలకు నీళ్లొదిలి పదవులను దక్కించుకున్నారు. అత్తిలి చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా అల్లరి మూకలు, కూటమి శ్రేణులతో మాజీ మంత్రి కారుమూరి నివాసాన్ని చుట్టిముట్టి వైఎస్సార్‌సీపీ సభ్యులు ఎన్నికకు హాజరుకాకుండా అడ్డుకోవడం కూటమి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనంగా నిలిచింది. ఎంపీపీ ఎన్నిక సందర్భంగా కూటమి దౌర్జన్యంపై ఎస్సై నుంచి డీజీపీ వరకు కారుమూరి ఫోన్లు చేసి వివరించే ప్రయత్నం చేసినా ఎవరూ స్పందించకపోవడం గమనార్హం. యలమంచిలి ఎంపీపీ ఎన్నికలో పదవుల కోసం కూటమి కుట్రలు ఫలించలేదు. పోలీసులు, కూటమి నేతలను అడ్డం పెట్టుకుని సామధాన దండోపాయాలు చేసినా వైఎస్సార్‌సీపీ సభ్యులు తలొగ్గకపోవడంతో కూటమి తోక ముడవక తప్పలేదు.
న్యూస్‌రీల్
కుట్రలు.. కేసులు
ఏప్రిల్ 8న వైఎస్సార్‌సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ అధ్యక్షతన ఏలూరులో జరిగిన సమావేశంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారని టీడీపీ నాయకుల ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు.
పాలకొల్లులో టిడ్కో లబ్ధిదారులకు ప్లాట్ల పంపిణీ సందర్భంగా 2022 ఆగస్టు 5న నాటి టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సమావేశంలో జరిగిన గొడవపై రెండేళ్ల తర్వాత 2024 డిసెంబర్ 13న పాలకొల్లు టౌన్ పోలీస్ స్టేషన్‌లో వైఎస్సార్‌సీపీ నేత యడ్ల తాతాజీ, ఎమ్మెల్సీ కవురు శ్రీని వాస్, పార్టీ నేత గుణ్ణం నాగబాబులతో పాటు మొత్తం 24 మందిపై కేసు నమోదు చేశారు.
మార్చి 28న యలమంచిలిలో ఎంపీపీ ఎన్నిక సందర్భంగా డీసీఎంఎస్ మాజీ చైర్మన్ యడ్ల తాతాజీ తనను కులం పేరుతో దూషించినట్టు టీడీపీ నేత ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అలాగే ఎంపీపీ ఎన్నిక సమయంలో తమ విధులకు ఆటంకం కలిగించారని, వీఆర్‌ఓ విధులకు అడ్డుకున్నారని పోలీసులు కేసులు నమోదు చేశారు.
సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న వారిపైన కూటమి కక్ష కట్టింది. రెండేళ్ల క్రితం తమ పార్టీ నేతలకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారంటూ కూటమి నేతల ఫిర్యాదులపై భీమవరానికి చెందిన పి. శ్రీనివాస్, బి.జయరామ్, జి.మురళీకృష్ణ, ఉండికి చెందిన జి.సుందర్‌కుమార్, కె.దొరబాబు, కె. మహేష్ తదితరులపై కేసులు నమోదయ్యాయి.
కూటమి కక్ష సాధింపులు
ఏడాది పాలనలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు
వైఎస్సార్‌సీపీ నేతలు, సోషల్ మీడియా యాక్ట్‌విస్ట్‌లే లక్ష్యం
వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ఎత్తుగడ
జిల్లాలో 37 మందిపై అక్రమ కేసులు
ఆటోడ్రైవర్‌పైనా జులుం
తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలి కానురూకు చెందిన సోషల్ మీడియా కార్యకర్త, ఆటో డ్రైవర్ పంజా దుర్గారావు తణుకు, నిడదవోలు పట్టణ రాజకీయాల్లో యాక్టీవ్‌గా ఉంటూ వైఎస్సార్‌సీపీకి సానుకూలంగా పోస్టులు పెడుతుంటారు. జనవరి 17న తణుకులో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అతని ఆటోని అడ్డగించి, వ్యతిరేకంగా పో స్టులు పెడతావా అంటూ దుర్భాషలాడారు. రవాణా శాఖ అధికారులను పి లిచి ఆటో సీజ్ చేయించారు. దుర్గారావుకు జ రిమానా విధించిన పోలీసులు 41 నోటీసు ఇచ్చి విడుదల చేశారు. 12 గంటలకుపైగా పోలీస్‌స్టేషన్‌లో ఉంచి దుర్గారావు పెట్టిన పోస్టులను పరిశీలించారు.
అరాచకాలు.. దౌర్జన్యాలు
అరాచకాలు.. దౌర్జన్యాలు
అరాచకాలు.. దౌర్జన్యాలు


