వేతనాల కోసం ఉపాధి కూలీల ధర్నా
పెంటపాడు: గత మూడు నెలలుగా ఉపాధి కూలీలకు వేతనాలు అందకపోవడంతో ఉపాధి కూలీలు నిరసన చేపట్టారు. వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా కార్యదర్శి కళింగ లక్ష్మణరావు ఆధ్వర్యంలో ఆకుతీగపాడు, బోడపాడు, ముదునూరు గ్రామాలలో నిరసన తెలిపారు. పనిచేస్తున్న ప్రదేశాలలో పలువురు కూలీలు మాట్లాడుతూ ఏప్రిల్ నెల నుంచి ఇంత వరకు వేతనాలు అందలేదన్నారు. పెరిగిన ధరలతో ఒక పక్క ఇబ్బందులు పడుతున్నామని, మరోవైపు కూలి పనులు చేసినా పస్తులు ఉండాల్సి వస్తోందని వాపోయారు. కూటమి ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉందన్నారు.


