అర్జీల పరిష్కారానికి తక్షణ చర్యలు | - | Sakshi
Sakshi News home page

అర్జీల పరిష్కారానికి తక్షణ చర్యలు

Nov 3 2026 2:15 AM | Updated on Nov 3 2026 2:15 AM

అర్జీల పరిష్కారానికి తక్షణ చర్యలు

హన్మకొండ అర్బన్‌: ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అందిన అర్జీలు బాధ్యతాయుతంగా పరిశీలించి, వెంటనే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో కలిసి ప్రజావాణి నిర్వహించారు. ఈసందర్భంగా ప్రజల నుంచి కలెక్టర్‌ స్వయంగా అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలను సావధానంగా విని అర్జీలు పెండింగ్‌లో లేకుండా సంబంధిత శాఖల అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని సూచించారు.

232 అర్జీల స్వీకరణ

కలెక్టరేట్‌తో పాటు హనుమకొండ, పరకాల ఆర్డీఓ కార్యాలయాలు, ఎంపీడీఓ కార్యాలయాల్లో నిర్వహించిన ప్రజావాణికికి 232 అర్జీలు అందాయి.

కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement