నవంబర్‌.. ప్రత్యేక హాజరు | - | Sakshi
Sakshi News home page

నవంబర్‌.. ప్రత్యేక హాజరు

Nov 3 2026 2:15 AM | Updated on Nov 3 2026 2:15 AM

నవంబర్‌.. ప్రత్యేక హాజరు

విద్యారణ్యపురి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులకు ముఖగుర్తింపు హాజరువిధానం (ఎఫ్‌ఆర్‌ఎస్‌) అమలు చేస్తున్నారు. కొంతకాలంగా విద్యార్థులు, టీచర్ల హాజరు ఆశించిన మేర నమోదు కావడంలేదని విద్యాశాఖ ఉన్నతాధికారుల పరిశీలనలో వెల్లడైంది. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌, సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్‌ నవీన్‌నికోలస్‌ నవంబర్‌ ప్రత్యేక హాజరు నెలగా.. వందశాతం హాజరు నమోదుకు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించాలని తాజాగా ఉత్తర్వులు జారీచేశారు. ఈనెల 2 నుంచి 30 వరకు రాష్ట్రంతోపాటు ఉమ్మడి వరంగల్‌ జిల్లాల్లోని ప్రభుత్వ, జిల్లాపరిషత్‌, రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో వందశాతం హాజరు డ్రైవ్‌ చేపట్టనున్నారు. ఇందుకోసం హనుమకొండ, వరంగల్‌, మహబూబాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి, జనగామ డీఈఓలు, ఆయా జిల్లాల ఎంఈఓలను, క్లస్టర్‌ హెడ్స్‌, హెడ్‌మాస్టర్ల సమన్వయంతో ప్రణాళిక ప్రకారం బాధ్యతలు నిర్వర్తించాలని ఆదేశించారు. జిల్లాస్థాయిలో ప్రతీవారం సమీక్షించాలని, అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.

వందశాతం అటెండెన్స్‌ నమోదుకు స్పెషల్‌ డ్రైవ్‌

విద్యార్థులు, టీచర్లకు

ఎఫ్‌ఆర్‌ఎస్‌ తప్పనిసరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement