ఖిలా వరంగల్: నిత్యావసర సరుకుల ధరలు సామాన్య, మధ్య తరగతి ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. చక్కెర, సన్నబియ్యం, అల్లం వెల్లుల్లి, ఉల్లి, వంట నూనెలు తదితర రేట్లు భారీగా పెరిగాయి. 50 రోజుల వ్యవధిలో సన్నబియ్యం ధరలు క్వింటాలుకు రూ.1500కు పైగా పెరిగాయి. చక్కెర, బియ్యం, ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ ,అల్లం, కూరగాయలు, వంటనూనెల ధరలు అకాశాన్నంటాయి. నెల కిందట రూ.250 చెల్లిస్తే వారానికి సరిపడా కూరగాయలు వచ్చేవి. ఇప్పుడు రూ.500 చెల్లించాల్సి వస్తోంది. ఎల్నినో ప్రభావంతో పంటలు దిగుబడి అంతంత మాత్రంగానే ఉండడం, డిమాండ్ మేరకు ఉత్పత్తి లేకపోవడమే ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు పేర్కొంటున్నారు.
సన్నబియ్యం ధరలకు రెక్కలు
ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేసిన తొలినాళ్లలో బహిరంగ మార్కెట్లో సన్నబియ్యం ధరలు దిగొచ్చాయి. 25 కిలోల సన్నబియ్యం బస్తా ధర నాలుగు నెలల క్రితం రూ.1400 ఉండగా ప్రస్తుతం రూ.2100కి చేరింది. మిగిలిన రకాల బియ్యం ధరలు రూ.300కు పైగా పెరిగాయి. రిటేల్గా తీసుకుంటే గతంలో కిలోకు రూ.55 ఉన్న సన్నబియ్యం ఇప్పుడు 79కు చేరింది. జైశ్రీరాం, సోనమసూరి కిలో రూ.65 నుంచి రూ.80 వరకు ధరకు విక్రయిస్తున్నారు. కిలో టమాట రూ.20 నుంచి రూ.30 ఉండగా.. మిగిలినవి రూ.60 వరకు ఉన్నాయి.
ఘాటెక్కిన ఉల్లి, వెల్లుల్లి, అల్లం
ప్రతి ఇంట్లో కచ్చితంగా ఉపయోగించే అల్లం, ఉల్లి, వెల్లుల్లి ఘాటెక్కాయి. రెండు నెలల క్రితం కిలో వెల్లుల్లి రూ.140 ఉండగా.. ఇప్పుడు ఏకంగా రూ.280కి చేరింది. అల్లం కిలో 120 నుంచి 130 వరకు చేరింది. రూ.100కు ఐదు కిలోలు లభించే ఉల్లిగడ్డను ఇప్పుడు కిలో రూ.50 నుంచి రూ.70కు ఇస్తున్నారు. చక్కెర కిలో రూ.70 పలుకుతోంది. నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో హోల్సేల్ మార్కెట్లో కొబ్బరికాయ సైజ్ను బట్టి రూ.25 నుంచి రూ.50 వరకు ఉంది. వేరుశనగలు రూ.160, కంది రూ.180, పెసరుపప్పు రూ.120, శనగపప్పు రూ.100, మినపప్పు ధర రూ.130 ఉంది.
కాగుతున్న వంటనూనెలు
దసరా పండగ వేళ వంటనూనెలు సలసల కాగుతున్నాయి. సన్ఫ్లవర్ ప్యాకెట్ రూ.172, పల్లినూనె ప్యాకెట్ రూ.190, పామాయిల్ ప్యాకెట్ ధర రూ.150కి చేరింది. నెల సంపాదనలో పెద్ద మొత్తం నిత్యావసరాలకే వెచ్చిస్తున్నామని సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వాలు స్పందించి ధరలను నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు.
నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలి
నిత్యావసర సరుకుల ధరలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలపై భారం పడుతోంది. కుటుంబాలను పోషించడం చాలా కష్టంగా మారింది. సంపాదించిన డబ్బులో సగం నిత్యావసర సరుకులకే సరిపోతోంది. పిల్లల అవసరాలు తీర్చాలంటే అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ధరలు తగ్గించాలి.
– గోనె లత, కరీమాబాద్, గృహిణి
280
172
180
140
190
150
170
160
130
145
155
120
100
110
79
80
70
20
50
పల్లి నూనె
ఉల్లిగడ్డ
చక్కెర
వెల్లుల్లి
కందిపప్పు
పెసరుపప్పు
వేరుశనగలు
అల్లం
శనగపప్పు
సన్ఫ్లవర్
పామాయిల్
సన్న బియ్యం
మండుతున్న నిత్యావసర సరుకుల ధరలు
చక్కెర, సన్నబియ్యం, అల్లం వెల్లుల్లి, ఉల్లి, వంట నూనెల రేట్లు ౖపైపెకి
బెంబేలెత్తుతున్న సామాన్య, మధ్య తరగతి ప్రజలు.. తగ్గించాలని విజ్ఞప్తి
నియంత్రణపై దృష్టి సారించాలి..
నిత్యావసర సరుకుల ధరలపై ప్రభుత్వంతో పాటు ధరల నియంత్రణ కమిటీలు కూడా దృష్టి పెట్టాలి. కేవలం 50 రోజుల్లోనే ధరలు ఈవిధంగా పెరిగిపోతే భవిష్యత్లో ఎలాంటి పరిస్థితి ఉంటుందో ఊహించుకోవచ్చు. వరంగల్ జిల్లా కేంద్రంలో కొందరు వ్యాపారులు సన్న బియ్యాన్ని రహస్యంగా నిల్వ చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది.


