గ్రామాల్లో వీబీజీ రాంజీ పనులు చేయాలి | - | Sakshi
Sakshi News home page

గ్రామాల్లో వీబీజీ రాంజీ పనులు చేయాలి

Oct 17 2026 12:58 AM | Updated on Oct 17 2026 12:58 AM

దుగ్గొండి: గ్రామాల్లో వీబీజీ రాంజీ పనులు ఎంత ఎక్కువగా చేస్తే అంత మొత్తంలో అభివృద్ధి నిధులు మంజూరవుతాయని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. చలపర్తి గ్రామంలో రూ.10 లక్షలతో చేపట్టిన మహిళా సమాఖ్య భవన నిర్మాణ పనులను శుక్రవారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. మహిళలను కోటీశ్వరులను చేయడానికి ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. వడ్డీ లేని రుణాలు అందించడంతోపాటు పరిశ్రమల స్థాపనకు అవకాశం కల్పిస్తుందన్నారు. మహిళా సాధికారత కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కుటీర పరిశ్రమలు స్థాపించి ఉపాధి కల్పించాలన్నారు.

మహిళలతో బతుకమ్మ ఆడిన ఎమ్మెల్యే దొంతి

గ్రామ సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. మహిళలతో కాసేపు బతుకమ్మ ఆడారు. అనంతరం మహిళలకు ముందస్తుగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్‌డీఓ నాగపద్మజ, తహసీల్దార్‌ సమ్మక్క, ఎంపీడీఓ అరుంధతి, ఏపీఎం రమేశ్‌, సింగిల్‌ విండో చైర్మన్లు తోకల శ్రీనివాసరెడ్డి, చెన్నూరి కిరణ్‌రెడ్డి, ఇంగోళి రాజేశ్వర్‌రావు, ముత్యాల కుమారస్వామి, మండల వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఒలిగె నర్సింగరావు, సర్పంచ్‌ కోటగిరి భాస్కర్‌, గ్రామ అధ్యక్షుడు నల్ల యాదవరెడ్డి, ఐకేపీ సీసీ సుజాత, గ్రామ సమాఖ్య అధ్యక్షురాలు నల్ల విమల, మహిళలు పాల్గొన్నారు.

నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

చలపర్తిలో మహిళా సమాఖ్య భవన నిర్మాణ పనులు ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement