● డీఏఓ విజయ్‌చంద్ర
కమలాపూర్: పట్టాదారు పాస్‌బుక్‌లు కలిగి ఉన్న రైతులంతా తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని డీఏఓ విజయ్‌చంద్ర సూచించారు. కమలాపూర్ మండలం మాదన్నపేటలో నిర్వహిస్తున్న ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని శనివారం ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న రైతులకు మాత్రమే ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి బావండపల్లి వేణు, వ్యవసాయ విస్తరణ అధికారి ప్రతాప్, రైతులు పాల్గొన్నారు.


