పరకాల: ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించడమే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ లక్ష్యమని.. ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా ఆధునిక వైద్య సదుపాయాలతో ప్రభుత్వ ఆస్పత్రులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. పరకాల వంద పడకల ఏరియా ఆస్పత్రిలో ఓపీ సేవలను కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్‌తో కలిసి స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి ప్రారంభించారు. స్వయంగా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆస్పత్రిలో జనరల్ వార్డుతో పాటు గైనకాలజీ, ఏఎన్‌సీ, ల్యాబొరేటరీ తదితర విభాగాలను కలెక్టర్ చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం ఆయన వైద్యులు, ఆస్పత్రి సిబ్బందితో సమావేశమయ్యారు. 24 గంటల పాటు ప్రజలకు వైద్యసేవలు అందించడానికి అందుబాటులో ఉండాలని ఆదేశించారు. 12 డిపార్ట్‌మెంట్లను 27 మంది వైద్యులతో వంద పడకల ఆస్పత్రి సేవలు ప్రారంభించినట్లు తెలిపారు. కార్యక్రమంలో పరకాల మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్‌కుమార్, ఆర్డీఓ డీఎస్ వెంకన్న, కమిషనర్ పవన్, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వంశీకృష్ణ, పలువురు ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది, అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి
పరకాల వంద పడకల ఆస్పత్రిలో వైద్య సేవలు ప్రారంభం


