రోడ్డుకు అడ్డంగా విరిగిపడిన చెట్టును జేసీబీతో తొలగిస్తున్న పోలీసులు
కమలాపూర్‌లో విరిగిపడ్డ విద్యుత్ స్తంభం వద్ద పోలీసులు, విద్యుత్ సిబ్బంది
కమలాపూర్: వాయుగుండం ప్రభావంతో కమలాపూర్ మండలవ్యాప్తంగా బుధవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురు గాలులతో పలు దఫాలుగా భారీ వర్షం కురిసింది. బలమైన ఈదురు గాలుల ధాటికి కమలాపూర్‌తో పాటు మండలంలోని పలు గ్రామాల్లో చెట్లు, చెట్ల కొమ్మలు రోడ్లకు అడ్డంగా, నివాస గృహాలు, విద్యుత్ స్తంభాలపై విరిగిపడ్డాయి. పలు చోట్ల తాటి చెట్లు విరిగిపడ్డాయి. పలు చోట్ల సుమారు 20 వరకు విద్యుత్ స్తంభాలు విరిగిపడగా.. మూడు చోట్ల విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు కింద పడిపోయి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సమాచారం అందుకున్న ఇన్‌స్పెక్టర్ నవీన్, ఎస్సైలు దిలీప్, మధు ఆధ్వర్యంలో పోలీసులు, ఎంపీడీఓ గుండె బాబు రోడ్లపై విరిగి పడ్డ వృక్షాలను జేసీబీ సాయంతో తొలగించి రాకపోకలు పునరుద్ధరించారు. విద్యుత్ శాఖ సిబ్బంది విరిగిన స్తంభాలను తొలగించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. పిడుగుపాటు శబ్దాలకు పలు గ్రామాల్లో విద్యుత్ ఉపకరణాలు, టీవీలు, ఫ్యాన్లు కాలిపోయాయి.
ఈదురు గాలులకు విరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు
నిలిచిన విద్యుత్ సరఫరా


