పనులు పూర్తవకపోతే ఓట్లడగను | - | Sakshi
Sakshi News home page

పనులు పూర్తవకపోతే ఓట్లడగను

Aug 23 2026 5:38 AM | Updated on Aug 23 2026 5:38 AM

స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి

వేలేరు: అభివృద్ధి పనులు పూర్తి చేయకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగనని స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. వేలేరు మండల కేంద్రంలోని రైతువేదికలో స్మార్ట్‌ రేషన్‌ కార్డులను ఆయన పంపిణీ చేశారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మల్లన్న గండి రిజర్వాయర్‌ పైప్‌లైన్‌ పనులు పూర్తిచేసి వచ్చే యాసంగి నాటికి మండలంలోని రైతులకు సాగునీరిస్తానని, నెలరోజుల్లో మండల కాంప్లెక్స్‌ల నిర్మాణం ప్రారంభించి ఏడాదిలోపు పనులు పూర్తి చేస్తానన్నారు. వేలేరు నుంచి కొమ్ముగుట్ట వరకు పంచాయతీ రాజ్‌ హ్యామ్‌ రోడ్ల పథకం ద్వారా రూ.14 కోట్లు మంజూరయ్యాయని, దసరా తర్వాత పనులు ప్రారంభించి వచ్చే మార్చి, ఏప్రిల్‌ వరకు పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ కోమి, సర్పంచ్‌లు బిల్లా యాదగిరి, అశోక్‌, కిరణ్‌, మనోజ్‌, శ్రీనివాస్‌, అనిత, మానస, మౌనిక, రమాదేవి, సాంబయ్య, రాజు, ఏఎంసీ డైరెక్టర్‌ కత్తి సంపత్‌, మండల అధ్యక్షుడు లక్ష్మణ్‌నాయక్‌, రేషన్‌ డీలర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement