రౌడీషీటర్లపై నిరంతర నిఘా | - | Sakshi
Sakshi News home page

రౌడీషీటర్లపై నిరంతర నిఘా

Aug 23 2026 5:38 AM | Updated on Aug 23 2026 5:38 AM

వరంగల్‌ క్రైం: పోలీస్‌ స్టేషన్‌ పరిధి రౌడీషీటర్ల వ్యవహార శైలిపై అధికారులు నిరంతరం నిఘా పెట్టాలని పోలీస్‌ కమిషనర్‌ శ్వేత ఆదేశించారు. నెలవారీ నేర సమీక్ష కమిషనరేట్‌ కార్యాలయంలో శనివారం నిర్వహించారు. ఈసందర్భంగా కమిషనర్‌ శ్వేత మాట్లాడారు. నేర నియంత్రణలో భాగంగా ప్రతీ పోలీస్‌ అధికారి నిరంతరం శ్రమించాల్సి ఉంటోందని సూచించారు. ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించడంతో పాటు వారి సమస్యలపై తక్షణమే స్పందించాలని చెప్పారు. ప్రజలతో స్నేహపూర్వకమైన వాతావరణాన్ని కొనసాగించాలని సూచించారు. అనంతరం పెండింగ్‌ కేసులకు సంబంధించి నిందితుల అరెస్ట్‌లు, కేసుల దర్యాప్తు, ప్రస్తుతం కోర్టులో ఉన్న కేసుల స్థితిగతుల గురించి అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో డీసీపీలు అంకిత్‌కుమార్‌, దారా కవిత, రాజమహేందర్‌ నాయక్‌, కిషన్‌సింగ్‌, అదనపు డీసీపీలు సురేశ్‌ కుమార్‌, బాలస్వామితో పాటు ఏసీపీలు, పోలీస్‌ ఇన్‌స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

పోలీస్‌ కమిషనర్‌ శ్వేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement