● ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి
ఖానాపురం: ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి అన్నారు. మండలంలోని పాకాలలో ఆదివారం పీఆర్‌టీయూ టీఎస్ జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీపాల్‌రెడ్డి మాట్లాడుతూ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి పోరాడతామన్నారు. పెండింగ్‌లో ఉన్న డీఏల విడుదల, పీఆర్‌సీ అమలు కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని చెప్పారు. సీపీఎస్ ఉద్యోగులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. గురుకులాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ముందుండి పని చేస్తామని హామీ ఇచ్చారు. పదోన్నతులు, బదిలీలు, ఏకీకృత సర్వీస్ సమస్యలు, పెండింగ్ బిల్లులు, జీతభత్యాల సమస్యలు, ఉద్యోగ భద్రత, పదవీ విరమణ ప్రయోజనాల అంశాలపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. అనంతరం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా మహేందర్ ఎన్నికయ్యారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయ సంఘం బాధ్యులు పాల్గొన్నారు.


