బాధ్యతాయుతంగా పనిచేయాలి | - | Sakshi
Sakshi News home page

బాధ్యతాయుతంగా పనిచేయాలి

Jul 25 2026 12:59 AM | Updated on Jul 25 2026 12:59 AM

ఖానాపురం: వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని కలెక్టర్‌ సత్యశారద సూచించారు. మండల కేంద్రంలోని పీహెచ్‌సీని శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీహెచ్‌ఓ పనితీరు, ఫ్రిజ్‌లోని వ్యాక్సిన్లు, మిషనరీలు, మెడిసిన్‌, రికార్డులు పరిశీలించారు. ఆశలు, ఏఎన్‌ఎంలు సెంటర్లలో ఉన్నారా అని వైద్యాధికారి జ్యోతి ద్వారా వీడియో కాల్‌ చేయించి నేరుగా తెలుసుకున్నారు. ఆస్పత్రిలో పనితీరు సరిగాలేదని మందలించారు. ఆస్పత్రి భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో తాత్కాలికంగా వెంటనే సమీపంలో ఉన్న బీసీ హాస్టల్‌కు మార్చాలని కోరారు. బీసీ హాస్టల్‌ భవనాన్ని సైతం తనిఖీ చేసి మరమ్మతులకు కావాల్సిన నివేదికలు పంపాలని పంచాయతీరాజ్‌ శాఖ అధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్‌ సత్యశారద మాట్లాడుతూ నూతన భవన నిర్మాణానికి రూ.1.43 కోట్ల నిధులు మంజూరైనట్లు వెల్లడించారు. ప్రస్తుత పీహెచ్‌సీని వెంటనే కూల్చివేసి నూతన భవన నిర్మాణ పనులు చేపట్టాలని, వైద్యసేవల్లో ఎలాంటి ఆంతరాయం కలుగకుండా చూసుకోవాలన్నారు. గ్రామాల్లో వ్యాధులు ప్రబలకుండా వైద్యసేవలు అందించాలని సూచించారు. అనంతరం మండలంలో సబ్‌సెంటర్ల అసంపూర్తి నిర్మాణాలు, శిథిలావస్థలో ఉన్న భవనాల పూర్తి నివేదికలు పంపాలని అధికారులను ఆదేశించారు. ఇన్‌చార్జ్‌ డీఎంహెచ్‌ఓ ప్రకాశ్‌, పీఆర్‌ ఈఈ ఇజ్జగిరి, తహసీల్దార్‌ నంగునూరి రమేశ్‌, ఎంపీడీఓ అద్వైత, వైద్యాధికారిని జ్యోతి, పీఆర్‌ ఏఈ ఉదయ్‌కుమార్‌, ఖానాపురం సర్పంచ్‌ దాసరి రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

రైతులు, కార్మికులకు మెరుగైన సౌకర్యాలు

ఖిలా వరంగల్‌: వరంగల్‌ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో రైతులు, హమాలీ కార్మికులు, వ్యాపారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద అన్నారు. ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌ను చైర్‌పర్సన్‌ ఎర్ర ప్రియాంక, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డి, మార్కెట్‌ ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎన్‌.శ్రీనివాస్‌తో కలిసి కలెక్టర్‌ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. మార్కెట్‌లో ప్రాథమిక ఆర్యోగకేంద్రం, చైల్డ్‌లేబర్‌ పాఠశాల, పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటుకు స్థలాలను పరిశీలించామని తెలిపారు. అనంతరం ముసలమ్మకుంట మామిడి మార్కెట్‌ను కలెక్టర్‌ సందర్శించారు. ఆర్డీఓ సుమ, డీఎంఓ కె.సురేఖ, తహసీల్దార్‌ శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

సర్‌ ప్రక్రియ పరిశీలన

కాశిబుగ్గ: వరంగల్‌లోని ఎల్‌బీనగర్‌, చార్‌బౌళిలో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర స వరణ (సర్‌) ప్రక్రియను కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశార ద శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ స ందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సర్వేను గడువులో గా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.

కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద

ఖానాపురంలో పీహెచ్‌సీ తనిఖీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement