మహా జాతరనూ వదల్లేదు! | - | Sakshi
Sakshi News home page

మహా జాతరనూ వదల్లేదు!

Feb 4 2026 8:23 AM | Updated on Feb 4 2026 8:23 AM

మహా జాతరనూ వదల్లేదు!

మహా జాతరనూ వదల్లేదు!

మహా జాతరనూ వదల్లేదు!

సాక్షిప్రతినిధి, వరంగల్‌ :తెలంగాణ కుంభమేళా మేడారం మహాజాతరను దొంగల ముఠాలు వదల్లే. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ నుంచి వచ్చి మేడారం జాతరలో భక్తుల రద్దీని ఆసరాగా చేసుకుని హల్‌చల్‌ చేసిన దొంగల వివరాలు ఆలస్యంగా వెలుగు చూస్తున్నాయి. ప్రధానంగా జంపన్న వాగు, గద్దెల పరిసరాల్లో భక్తుల మొబైల్‌ ఫోన్లు, బంగారు గొలుసులు, నగదును దొంగిలించిన ఘటనల్లో కీలక వ్యక్తుల సమాచారం లభమైంది. ‘వ్యాల్యూ పిచ్‌’ సాఫ్ట్‌వేర్‌ ఆధారంగా ఫేస్‌ రికగ్నైజేషన్‌ సిస్టంతో ఈ దొంగతనాలకు సంబంధించి కొందరు నిందితులను, దొంగిలించిన వస్తువులను కొనుగోలు చేసేవారిని పోలీసులు అరెస్ట్‌ చేయడం చర్చనీయాంశం అవుతోంది. మేడారం జాతరలో ఫేస్‌ రికగ్నైజేషన్‌ ద్వారా గతంలో దొంగతనాలకు పాల్పడిన అంతర్రాష్ట్ర ముఠాలకు చెందిన దొంగలను గుర్తించినట్లు క్రైం ఇన్వెస్టిగేషన్‌ విభాగం ప్రకటించింది.

సాంకేతిక సహకారంతో దొంగల ఆటకట్టు..

సమ్మక్క–సారలమ్మను దర్శించుకునే భక్తులపై పటిష్టమైన పర్యవేక్షణ, వారి కదలికలు, వాహనాల రాకపోకలను నిశితంగా గమనించేందుకు ఈ జాతరలో ఏఐ (ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌)తో కూడిన ప్రత్యేక కెమెరాలు పెట్టారు. ఆటోమెటిక్‌ నంబర్‌ ఫేస్‌ రికగ్నైజేషన్‌ కెమెరాలను (ఏఎన్పీఆర్‌) పది చోట్ల అమర్చారు. దొంగతనాలకు పాల్పడే పాత నేరస్తులను గుర్తించేందుకు ఆటోమెటిక్‌ ఫేస్‌ రికగ్నైజేషన్‌ కోసం ప్రత్యేక సీసీ కెమెరాలను జనం రద్దీ ఉండే అన్ని ప్రాంతాల్లో పెట్టారు. గతంలో తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్ప డిన మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, బిహార్‌ ఇతర రాష్ట్రాలకు చెందిన దొంగల ఫొటోలను కంప్యూటర్‌లో ఫీడ్‌ చేశారు. వ్యాల్యూ పిచ్‌ అనే సాఫ్ట్‌వేర్‌తో అనుసంధానం చేయడంలో వల్ల కంప్యూటర్‌లో ఫీడ్‌ చేసిన ఫొటోల్లోని వ్యక్తులు ఎవరు వచ్చినా పోలీసులకు అలర్ట్‌ ఇస్తుంది. ఇదంతా గద్దెల పక్కనే ఉన్న కమాండ్‌ కంట్రోల్‌ రూంలో అమర్చిన పెద్ద ఎల్‌సీడీ స్క్రీన్లను 24/7 నిరంతర పర్యవేక్షణ చేసేలా ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఈ విధానం ద్వారా జాతర జరిగిన 4రోజుల్లో పాత దొంగలు వ చ్చినట్లు 70 అలర్ట్‌లు వచ్చాయి. డ్రోన్‌, సీసీ కెమెరా లు ఆ దొంగలను గుర్తించి కమాండ్‌ కంట్రోల్‌ రూంకు వారి ముఖాలను పంపడంతో అప్రమత్తమైన పోలీసులు మహారాష్ట్ర, ఏపీలోని నంద్యాల గ్యాంగ్‌లకు చెందిన 5ని అరెస్టు చేసి విచారిస్తున్నారు.

మేడారంలో మహారాష్ట్ర,

నంద్యాల దొంగలు

ట్రేస్‌ చేసిన వ్యాల్యూ పిచ్‌ సాఫ్ట్‌వేర్‌

‘ఫేస్‌ రికగ్నైజేషన్‌ సిస్టం’తో దొరికిన ఆచూకీ

70 మంది గుర్తింపు, ఐదుగురి అరెస్టు.. విచారణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement