లెక్క తేలింది..
న్యూస్‌రీల్
బుధవారం శ్రీ 4 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
సాక్షి, వరంగల్: ఈ నెల ఏడు నుంచి టీ–ట్వంటీ వ రల్డ్ కప్ క్రికెట్ యుద్ధం ఓవైపు మొదలవుతుండగా.. అదే పంథాలో జిల్లాలో ము న్సిపల్ ఎన్నికల మహాసంగ్రామం ఆసక్తి రేపుతోంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల మించి ముఖ్యంగా పార్టీ గుర్తులపై జరుగుతున్న నర్సంపేట, వర్ధన్నపేట ము న్సిపల్ ఎన్నికల్లో ట్వంటీ20 బ్యాటింగ్ చేసేందుకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీలు కదనరంగంలోకి ది గాయి. సీపీఎం, ఏఐఎఫ్‌బీ, జనసేన, ఇతర గుర్తింపు పార్టీలతో పాటు స్వత్రంతులు అదృష్టాన్ని పరీ క్షించుకుంటున్నారు. మొత్తంగా నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీల్లో బరిలో ఉండే అభ్యర్థుల లెక్క తేలింది. మొత్తం 42 వార్డుల నుంచి 314 నా మినేషన్లు దాఖలైతే 144 మంది ఉపసంహరించుకోవడంతో 170 మంది బరిలో ఉన్నారు. నర్సంపేటలోని 30 వార్డుల నుంచి కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీల నుంచి 90 మంది అభ్యర్థులు బరిలో ఉంటే, ఇతరులు 30 మంది ఉన్నారు. బీఆర్‌ఎస్ నుంచి ముగ్గురు రెబల్స్ బరిలో ఉన్నారు. వర్ధన్నపేట ము న్సిపాలిటీలోని 12 వార్డుల నుంచి 89 మంది బరి లో ఉంటే 39 మంది తప్పుకోవడంతో 50 మంది అ దృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీల నుంచి 36 మంది ఉంటే, ఇతరులు 14 మంది పోటీ పడుతున్నారు. ఇతరుల్లో బీఆర్‌ఎస్ నుంచి ఇద్దరు, కాంగ్రెస్ నుంచి ఒకరు రెబల్స్ ఉన్నారు. అయితే నామినేషన్ల ఉపసంహరణ మంగళవారం ముగియడం, పార్టీల నుంచి బీ ఫామ్‌లు దక్కించుకున్న అభ్యర్థులు సమర్పించడంతో ఇక రాజకీయ ప్రచార క్రీడ మొదలైంది. ఈ నెల 11న జరగనున్న ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఆట మొదలు పెట్టడంతో పొలిటికల్ హీట్ పె రిగింది. ప్రధానంగా ఈ మున్సిపాలిటీల్లో మెజార్టీ సీట్లు చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ ఆరాటపడుతుండగా, గతంలో సీట్లు దక్కించుకొని చైర్మన్లు ని లుపుకోవాలని బీఆర్‌ఎస్ పట్టుదలతో ఉంది. బీజేపీ కూడా గౌరవప్రదమైన స్థానాల్లో గెలిచేందుకు పోరా డుతుండడంతో రాజకీయ క్రీడ రసకందాయకంగా మారింది. మరో ఏడు రోజుల పాటు ఆడనున్న ఈ రాజకీయ క్రీడలో 11న విజేతలెవరో తేలిపోనుంది.
బుజ్జగింపులు..బీ ఫామ్‌లతో బిజీ..
నామినేషన్ల ఉపసంహరణకు, బీఫామ్‌ల సమర్పణకు మంగళవారమే చివరి రోజు కావడంతో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ముఖ్యనేతలు ఆయా వార్డుల నుంచి ఒకరికి మించి ఎక్కువగా బరిలో ఉన్న తమ పార్టీ అభ్యర్థులను బుజ్జగించారు. భవిష్యత్‌లో మంచి పదవులు ఇస్తామంటూ నచ్చజెప్పారు. నర్సంపేట నుంచి ముగ్గురు బీఆర్‌ఎస్ రెబల్స్, వర్ధన్నపేట నుంచి ఇద్దరు బీఆర్‌ఎస్ రెబల్స్, కాంగ్రెస్ నుంచి ఒకరు రెబల్స్ మాత్రం పోటీకి సై అంటుండడంతో ఆయా పార్టీల్లో టెన్షన్ మొదలైంది. ఎందుకంటే ఒక్క వార్డుతో ఓడి చైర్మన్ పీఠాలు చేజారే అవకాశం ఉండడంతో ఆందోళన కలిగిస్తోంది. కాగా మంగళవారం నాటికి నామినేషన్ల ఉపసంహరణ ముగియడంతో బరిలో ఉన్న స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల అధికారులు గుర్తులు కేటాయించారు.
వర్ధన్నపేట మున్సిపల్ బరిలో
50 మంది అభ్యర్థులు
170 మంది ఇన్.. 144 అవుట్
42 వార్డుల్లో మున్సిపల్ ఎన్నికల
మహా సంగ్రామం
ఫలించిన ప్రధాన పార్టీల
బుజ్జగింపుల పర్వం
కాంగ్రెస్ పార్టీకి
రెబల్స్ లేకుండా మంతనాలు
నర్సంపేటలో మూడు చోట్ల
బీఆర్‌ఎస్‌కు రెబల్స్ బెడద
ట్వంటీ20 వరల్డ్‌కప్ మాదిరిగా
ఆసక్తి రేపుతున్న రాజకీయ క్రీడ
మున్సిపాలిటీ వార్డులు నామినేషన్లు ఉపసంహరణ బరిలో..
నర్సంపేట 30 225 105 120
వర్ధన్నపేట 12 89 39 50
మొత్తం 42 314 144 170
లెక్క తేలింది..
లెక్క తేలింది..


