ఆడపిల్లల చదువే అసమానతలకు అడ్డుకట్ట | - | Sakshi
Sakshi News home page

ఆడపిల్లల చదువే అసమానతలకు అడ్డుకట్ట

Feb 4 2026 8:23 AM | Updated on Feb 4 2026 8:23 AM

ఆడపిల్లల చదువే అసమానతలకు అడ్డుకట్ట

ఆడపిల్లల చదువే అసమానతలకు అడ్డుకట్ట

అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి

నర్సంపేట రూరల్‌: ఆడపిల్లల చదువే అసమానతలకు అడ్డుకట్ట అని అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి అన్నారు. మంగళవారం చెన్నారావుపేట మండలకేంద్రంలోని కస్తూర్భా బాలికల విద్యాలయంలో జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ, జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో జిల్లా మహిళా శిశు సంక్షేమశాఖ అధికారిణిని రాజమణి అధ్యక్షతన ఘనంగా జాతీయ బాలికల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ ఆడపిల్లలు ప్రతీ రంగాల్లో ముందుండాలని, ఆడపిల్లల కోసం ప్రభుత్వం ఎన్నో రకాల కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. ఆడపిల్లలు ధైర్యంగా అనుకున్న లక్ష్యాల్ని నేరవేర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఈఓ వెంకటరామిరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి కల్పన, జిల్లా అకడమిక్‌ మానిటరింగ్‌ అధికారి సుజన్‌ తేజ, సీడీపీఓ మధురిమ, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ ప్రకాశ్‌, తహసీల్దార్‌ మహమ్మద్‌ అబిద్‌ అలీ, ఎంపీడీఓ వెంకటసాయి శివానంద్‌, ఎంఈఓ సరళ, ఎస్‌ఓ మెట్టుపల్లి జ్యోతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement