
ఆరోగ్య స్థితిగతుల సూచిక ‘కిశోరరక్ష’
సంగెం: జిల్లాలో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కిశోర రక్ష కార్యక్రమం విద్యార్థుల ఆరోగ్య స్థితిగతులను తెలియజేయడానికి ఎంతో ఉపకరిస్తుందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి సాంబశివరావు అన్నారు. మండలంలోని గవిచర్ల మోడల్ స్కూల్‌లో నిర్వహిస్తున్న కిశోర రక్ష కార్యక్రమంలో బాలబాలికలకు నిర్వహిస్తున్న స్క్రీనింగ్ పరీక్షలను మంగళవారం ఆయన పర్యవేక్షించి, మాట్లాడారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించడం వల్ల ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. మలమూత్ర విసర్జన అనంతరం, భోజనం చేసే ముందు తప్పకుండా సబ్బుతో చేతులను కడుక్కోవాలని సూచించారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి వంశీకృష్ణ, ప్రిన్సిపాల్ ప్రసన్నలక్ష్మి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ సాంబశివరావు