
వ్యాధులు ప్రబలకుండా పటిష్ట చర్యలు
హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లాలో సీజనల్ వ్యాధుల ప్రబలకుండా ప్రజల్లో విస్తృత చర్యలు చేపట్టాలని ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారి, రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ వాసం వెంకటేశ్వర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం హనుమకొండ కలెక్టరేట్‌లో జిల్లాలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న వైద్య సదుపాయాలపై కలెక్టర్ స్నేహ శబరీష్‌తో కలిసి డీఎంహెచ్‌ఓ అప్పయ్య, వివిధ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ.. జిల్లాలో డ్రై డే కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆశాలు, ఏఎన్‌ఎంలతో గ్రామాల్లో ఫీవర్ టెస్టులు చేస్తున్నట్లు తెలిపారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. స మావేశంలో డీపీఓ లక్ష్మీ రమాకాంత్, అడిషనల్ డీ ఎంహెచ్‌ఓ మదన్‌మోహన్ రావు, జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి గౌతమ్ చౌహన్ ఉన్నారు.