డీఈఓ జ్ఞానేశ్వర్‌పై చర్యలు తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

డీఈఓ జ్ఞానేశ్వర్‌పై చర్యలు తీసుకోవాలి

Aug 15 2025 6:32 AM | Updated on Aug 15 2025 6:32 AM

డీఈఓ జ్ఞానేశ్వర్‌పై  చర్యలు తీసుకోవాలి

డీఈఓ జ్ఞానేశ్వర్‌పై చర్యలు తీసుకోవాలి

విద్యారణ్యపురి: వరంగల్‌ విద్యాశాఖ సమగ్రశిక్ష జిల్లా క్వాలిటీ కో–ఆర్డినేటర్‌ సుజన్‌తేజపై అనుచిత వ్యాఖ్యలు చేసిన డీఈఓ మామిడి జ్ఞానేశ్వర్‌పై చర్యలు తీసుకోవాలని వివిధ ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు గురువారం హనుమకొండలోని పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ సత్యనారాయణరెడ్డికి వినతిపత్రం అందించారు. ఈనెల 12న ఎంఈఓలతో నిర్వహించిన జూమ్‌ మీటింగ్‌లో అకడమిక్‌ విషయాలపై సుజన్‌తేజ మాట్లాడుతుండగా జ్ఞానేశ్వర్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆర్జేడీ దృష్టికి తీసుకెళ్లారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో తెలంగాణ గెజిటెడ్‌ హెడ్మాస్టర్ల అసోసియేషన్‌, టీఎస్‌యూటీఎఫ్‌, డీటీఎఫ్‌, టీపీటీఎఫ్‌, టీపీయూఎస్‌, ఎస్‌సీఎస్‌టీ యూఎస్‌ బాధ్యులు ఎస్‌.రవీందర్‌, తాటికాయల కుమార్‌, సి.సుజన్‌ప్రసాద్‌రావు, నామోజు శ్రీనివాస్‌, ఎ.శ్రీనివాస్‌రెడ్డి, గోవిందరావు, కడారి భోగేశ్వర్‌, బి.వెంకటరమణ, ఎస్‌.వెంకన్న, ఎం.నర్సయ్య, గుండు కరుణాకర్‌, ఎస్‌ఏ రవూఫ్‌, కె.రవీందర్‌, వి.అరవింద్‌, కె.కుమారస్వామి ఉన్నారు.

పీఏసీఎస్‌, డీసీసీబీల

కాల పరిమితి పెంపు

హన్మకొండ: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, డీసీసీబీల పాలకవర్గాల కాలపరిమితిని ప్రభుత్వం పొడిగించింది. 2025 ఫిబ్రవరి 14 నాటికి ఐదేళ్ల కాలపరిమితి ముగియగా.. ఆరు నెలలు పెంచింది. ఈ గడువు కూడా గురువారంతో ముగిసింది. రాష్ట్ర ప్రభుత్వం మరో ఆరు నెలలు పొడిగించింది. ఈమేరకు ఏపీసీ అండ్‌ సెక్రటరీ టు గవర్నమెంట్‌ ఎం.రఘునందన్‌ రావు ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్‌ డీసీసీబీ ప్రస్తుత పాలక వర్గం కాల పరిమితి ఈ నెల 24తో ముగియనుంది. దీంతో ప్రస్తుత పాలక వర్గంలో మరో ఆరు నెలల పాటు కొనసాగనుంది. ఈసందర్భంగా తెలంగాణ స్టేట్‌ కో–ఆపరేటివ్‌ అపెక్స్‌ బ్యాంక్‌ చైర్మన్‌ మార్నేని రవీందర్‌రావు మాట్లాడుతూ.. ఈనెల 15న వరంగల్‌ డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో, ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని అన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో సీఎం రేవంత్‌ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు చిత్ర పటాలకు క్షీరాభిషేకం చేయనున్నట్లు తెలిపారు.

లష్కర్‌ సింగారం పట్టణ

ఆరోగ్య కేంద్రం తనిఖీ

హన్మకొండ: హనుమకొండ సమ్మయ్యనగర్‌లోని లష్కర్‌ సింగారం పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని గురువారం హనుమకొండ కలెక్టర్‌ స్నేహ శబరీష్‌ తనిఖీ చేశారు. ప్రతీ రోజు ఎంత మంది రోగులు వస్తున్నారో రికార్డులు పరిశీలించా రు. ఈహెచ్‌ఎంఐఎస్‌ ఆన్‌లైన్‌ పోర్టర్‌లో నమో దు చేసిన వివరాలను పట్టణ ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి హైదర్‌ను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అప్పయ్య, పట్టణ ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి హైదర్‌, సిబ్బంది పాల్గొన్నారు.

స్కూల్‌ టాపర్లకు

నగదు ప్రోత్సాహకాలు

విద్యారణ్యపురి: ప్రభుత్వ పాఠశాలల్లో పదోతరగతి, ఇంటర్‌ చదివి జిల్లా టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు ఈనెల 15న స్వాతంత్య్ర వేడుకల్లో నగదు ప్రోత్సాహకాలు అందించనున్నారు. ప్రతీ జిల్లా నుంచి పదో తరగతిలో ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు, ఇంటర్‌లో ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలకు ఒక్కొక్కరికి రూ.10 వేలు అందించనున్నారు. వీరికి హనుమకొండ పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించే స్వాతంత్య్ర వేడుకల్లో నగదు, ప్రశంసపత్రాలు అందించనున్నారు.

రేపు జిల్లా స్థాయి

వాలీబాల్‌ ఎంపికలు

వరంగల్‌ స్పోర్ట్స్‌: ఈనెల 16న హనుమకొండలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో అండర్‌–15 బాలబాలికల జిల్లా స్థాయి వాలీబాల్‌ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు పాఠశాల క్రీడల సమాఖ్య జిల్లా కార్యదర్శి ప్రశాంత్‌కుమార్‌ గురువారం ఒక ప్రకనటలో తెలిపారు. క్రీడాకారులు జనవరి 01, 2010 తర్వాత జన్మించిన వారై ఉండాలని, వెంట ఆధార్‌, బోనోఫైడ్‌ సర్టిఫికెట్లతో ఉదయం 9గంటలకు వాలీబాల్‌ గ్రౌండ్‌ వద్ద కన్వీనర్‌ రాముడుకు రిపోర్ట్‌ చేయాలని సూచించారు. ఇందులో ప్రతిభ కనబర్చిన జట్టు ఈనెల 18, 19 తేదీల్లో సరూర్‌నగర్‌లో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement