
226 మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లకు శిక్షణ
హన్మకొండ అర్బన్: జిల్లాలో లైసెన్స్‌డ్ సర్వేయర్ శిక్షణ కోసం దరఖాస్తు చేసుకుని ఎంపికైన 226 మందికి క్షేత్రస్థాయి శిక్షణ కోసం 14 మండలాలు, హనుమకొండ, పరకాల ఆర్డీఓ కార్యాలయాలు, జిల్లా కేంద్రంలోని ఏడీ కార్యాలయాన్ని కేటాయించినట్లు సర్వే ల్యాండ్ రికార్డ్స్ అదనపు సంచాలకులు శ్రీనివాస్ తెలిపారు. వీరంతా 40 పనిదినాలు క్షేత్రస్థాయిలో ప్రభుత్వ సర్వేయర్లు, డీఐ, ఏడీ సమక్షంలో శిక్షణ పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికే వీరికి తరగతుల నిర్వహణ పూర్తయ్యిందని, పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. 226 మంది క్షేత్ర శిక్షణకు వచ్చినట్లు తెలిపారు.