ఎల్కతుర్తి జంక్షన్ ప్రారంభోత్సవానికి సిద్ధం చేయండి
కుడా చైర్మన్, బల్దియా కమిషనర్
అశ్విని తానాజీ వాకడే
వరంగల్/నయీంనగర్: మూడు జిల్లాలకు తలమానికంగా నిలవనున్న ఎల్కతుర్తి జంక్షన్‌ను ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని కుడా చైర్మన్, బల్ది యా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే ‘కుడా’ అధికారులను ఆదేశించారు. ఎల్కతుర్తి బస్టాండ్ సమీపంలోని ప్రధాన కూడలిని వైస్‌చైర్మన్ గురువారం క్షేత్రస్థాయిలో సందర్శించారు. జంక్షన్ నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకుని వేగవంతంగా పూర్తి చేయాలని సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వరంగల్, సిద్దిపేట, కరీంనగర్, వరంగల్ ఉమ్మడి జిల్లాలకు ఈ కూడలి తలమానికంగా నిలిచేలా పెద్ద విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రారంభించడానికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కుడా సీపీఓ అజిత్‌రెడ్డి, ఈఈ భీమ్‌రావు పాల్గొన్నారు.


