బ్రహ్మోత్సవాలకు కేటీఆర్‌కు ఆహ్వానం
ఐనవోలు: ఐనలోలు శ్రీ మల్లికార్జనస్వామి బ్రహ్మోత్సవాలకు రావాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను హైదరాబాద్‌లో శనివారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆధ్వర్యంలో ఐనవోలు గ్రామ సర్పంచ్ గడ్డం రఘువంశీ కలిసి ఆహ్వానించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పల్లకొండ సురేశ్, ఉప సర్పంచ్ అడ్డగూడి సతీశ్, నాయకులు కాటబోయిన అశోక్, తండా వెంకన్న, వార్డు సభ్యులు దుపెల్లి రాజు, కొత్తూరు సరిత, జాన్సన్, బత్తుల ప్రవీణ్, మండల నాయకులు చింత అశోక్, రాజిరెడ్డి, రాజు, పురుషోత్తం, చందు తదితరులు పాల్గొన్నారు.


