దరఖాస్తుల ఆహ్వానం
కాళోజీ సెంటర్: ఫిబ్రవరి 2వ తేదీ నుంచి నిర్వహించనున్న ప్రయోగ పరీక్షల నిమిత్తం జిల్లాలోని 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రయోగ సామగ్రి పంపిణీకి సీల్డ్ టెండర్లు ఆహ్వానిస్తున్నట్ల ఇంటర్మీడియట్ విద్యాశాఖ జిల్లా అధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కలెక్టర్ అధ్యక్షతన ఏర్పడిన జిల్లా ల్యాబ్ సామగ్రి సమీకరణ కమిటీ (డిస్ట్రిక్ట్ ల్యాబ్ ప్రోక్యూర్‌మెంట్ కమిటీ) ఆధ్వర్యంలో అర్హులైన ప్రయోగ సామగ్రి పంపిణీదారుల నుండి సీల్డ్ టెండర్ దరఖాస్తులు ఈనెల 12 నుంచి 16వ తేదీ వరకు బాక్స్‌లో వేయాలని సూచించారు. ఈనెల 17న సాయంత్రం 4 గంటలకు టెండర్ బాక్స్‌లు ఓపెన్ చేయనున్నట్లు తెలిపారు. పంపిణీదారులు ప్రభుత్వ నిబంధనల మేరకు సంస్థ రిజిస్ట్రేషన్, జీఎస్టీ, ఆదాయం, వార్షిక టర్నోవర్ తదితర ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలన్నారు. పూర్తి వివరాలకు ఇంటర్ విద్యా కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
సమస్యల సాధనకు కృషి
నర్సంపేట: సమస్యల సాధనకు సంఘటితంగా పోరాడాలని భారతీయ జీవిత బీమా ఏజెంట్ల సమైక్య ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ ఎస్‌బి.శ్రీనివాసచారి పిలుపునిచ్చారు. ఈ మేరకు పట్టణంలో ఆదివారం నర్సంపేట శాఖ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసచారి మాట్లాడుతూ జీవిత బీమా సంస్థ అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్న ఏజెంట్ల అభ్యున్నతికి కృషి చేద్దామన్నారు. సంస్థ పరంగా ఉన్నటువంటి సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తూనే ముందుకు సాగుదామన్నారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట బ్రాంచ్ అధ్యక్షుడు శ్రీహరి, గాదె మోహన్‌రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు పులి సుధాకర్, మోహన్‌రావు, గోపాల్‌రావు, కృష్ణారావు, వెంకట్‌నారా యణ, ఎండీ.హుస్సేన్, రాక రాజలింగం, సో మయ్య, సోమయ్య, శ్రీరామ్, రాజా, శ్రీనివాస్, గోపి, కిశోర్, అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ మండే కుమారస్వామి, తదితరులు పాల్గొన్నారు.
సీసీఆర్బీని తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలోని సీసీఆర్బీ కార్యాలయాన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ ఆదివారం సాయంత్రం తనిఖీ చేశారు. సెక్షన్ల వారీగా పోలీస్ సిబ్బంది నిర్వహిస్తున్న విధులు, వారు నిర్వహిస్తున్న రికార్డులు, అందులో నమోదు చేసిన వివరాలను సంబంధిత సెక్షన్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. నేరాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. తనిఖీల్లో అదనపు డీసీపీ రవి, ఏసీపీలు డేవిడ్ రాజు, జనార్దన్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్లు శ్రీనివాస్, సంజీవ్, మల్లయ్య, ప్రవీణ్ కుమార్, శ్రీనివాస్‌రావు, ఎస్సైలు సిబ్బంది పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం


