యువతకు ఉపాధి కల్పనే ధ్యేయం
దుగ్గొండి: మాది వ్యవసాయ ఆధారిత కుటుంబం. మా తండ్రి సుకినె పెద్ద రాజేశ్వర్‌రావు 15 ఏళ్ల క్రితం చనిపోయారు. కుటుంబ పరిస్థితుల కారణంగా పదో తరగతి వరకు చదివి మా అమ్మకు అండగా ఉండి వ్యవసాయ చేశా. అయినా గ్రామానికి ఏదైన చేయాలనే తపనతో గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరా. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గెలుపుకోసం మండల వ్యాప్తంగా యువతను ఒక్కతాటిపై తీసుకువచ్చి చేసిన కృషి ఫలిచింది. అనంతరం సర్పంచ్ ఎన్నికలు రాగానే గ్రామానికి సేవ చేయాలనే తపన ఉన్న తనను సర్పంచ్‌గా పోటీ చేయాలని ఎమ్మెల్యే సూచించారు. రాజకీయాలకు అతీతంగా అందరూ సహకరించి అధిక మెజార్టీతో గెలిపించారు. ప్రస్తుతం గ్రామంలో అన్ని మౌలిక వసతులతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి నైపుణ్య శిక్షణ ఇప్పిస్తా. పాలకుడిగా కాకుండా సేవకుడిగా ప్రజలకు అండగా ఉంటా.
– సుకినె నాగరాజు, సర్పంచ్ శివాజీనగర్


