ఘనంగా ‘కుడారై’ ఉత్సవం
వర్ధన్నపేట: ధనుర్మాసోత్సవాల్లో భాగంగా ఆదివారం వర్ధన్నపేట పట్టణంలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో ‘కుడారై’ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ పూజారులు కలకోట గోపాలచార్యులు, శ్రవణకుమారచార్యులు, రామాచార్యులు, అచ్చి వెంకట శేషశయనం, వెంకటరమణ ఆధ్వర్యంలో రంగనాథుడికి అత్యంత ప్రీతిపాత్రమైన కుడారై ఉత్సవంలో భాగంగా 108 పాయసం గిన్నెలతో స్వామి వారికి నైవేద్యం చేశారు. ధనుర్మాసంలో 27వ రోజైన కుడారై పవిత్ర దినం ఎంతో గొప్పదని వేద పండితులు చెబుతున్నారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు.
సన్నూరు వేంకటేశ్వరస్వామి ఆలయంలో..
రాయపర్తి: మండలంలోని సన్నూరు వెంకటేశ్వరపల్లిలోని ప్రముఖ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం కుడారై ఉత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయంలో ఈనెల 14న నిర్వహించనున్న గోదారంగనాథస్వామి కల్యాణంలో భాగంగా 108 గంగాలతో కుడారై ఉత్సవాన్ని నిర్వహించినట్లు ఆలయ ప్రధానార్చకులు ఆరుట్ల రంగాచార్యులు, రమణాచార్యులు తెలిపారు. ఈ సందర్భంగా 108 గంగాలలో క్షీరాన్ననివేదన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆ లయ ధర్మకర్తలు, భక్తులు పాల్గొన్నారు.
ఘనంగా ‘కుడారై’ ఉత్సవం


