హక్కుల సాధనకు ఐక్య పోరాటం | - | Sakshi
Sakshi News home page

హక్కుల సాధనకు ఐక్య పోరాటం

Oct 24 2026 12:34 AM | Updated on Oct 24 2026 12:34 AM

● పండుగ సాయన్న స్ఫూర్తితో

అన్యాయాలపై పోరాడాలి

● శాసనమండలి డిప్యూటీ

చైర్మన్‌ బండ ప్రకాష్‌

మదనాపురం: బలహీనవర్గాలు తమ హక్కుల సాధన కోసం ఐక్యంగా నిరంతరం పోరాటం చేయాలని తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ బండ ప్రకాష్‌ పిలుపునిచ్చారు. శుక్రవారం మండలంలోని దంతనూరులో పోరాట యోధుడు పండుగ సాయన్న విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. అన్యాయాలు, అక్రమాలను ఎదురించిన పండుగ సాయన్న పోరాట స్ఫూర్తి ప్రతి ఒక్కరిలో నిండాలని ఆకాంక్షించారు. స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా ముదిరాజ్‌ల స్థితిగతుల్లో ఆశించిన మార్పు రాలేదని.. నేటికీ భూమి లేని పేదలు 72 శాతం, తీవ్ర పేదరికంలో ఉన్నవారు 68 శాతం మంది ఉన్నారని వివరించారు. చదువుకు దూరమవుతున్న ఆడబిడ్డల శాతం 70 దాకా ఉందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చునని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ–డి నుంచి బీసీ–ఏ గ్రూప్‌ మార్పునకు గతంలో చేపట్టిన సుదీర్ఘ పోరాటాలు, కాంగ్రెస్‌ మేనిఫెస్టో కమిటీ సభ్యుడిగా తాను చేసిన కృషిని గుర్తుచేశారు. దినపత్రికల్లో వచ్చే శీర్షికలు సంతోషాన్నిచ్చినా.. ఆచరణలో విజయం సాధించే వరకు నిత్యం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్స్యశాఖ ద్వారా గతంలో చేపట్టిన సంక్షేమ పథకాలు, 75 శాతం రాయితీపై 62 వేల మందికి ద్విచక్ర వాహనాలు, 4 వేల మందికి త్రీవిల్లర్లు, డీసీఎం వాహనాలు ఇప్పించిన తీరును వివరించారు. ప్రతి గ్రామంలో ముదిరాజ్‌ కమిటీలు, యువజన సంఘాలు, మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. 50 మంది సభ్యులతో మూడేళ్లు విజయవంతంగా నడిచే మహిళా సంఘాలకు ప్రభుత్వం నుంచి రూ.3 లక్షల నుంచి రూ 5 లక్షల వరకు ఉచిత గ్రాంట్‌ అందుతుందని తెలిపారు. నీటి వనరులు, ప్రాజెక్టులు ఉన్న ఈ ప్రాంత మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్‌ నాగరాజుగౌడ్‌, రాష్ట్ర ముదిరాజ్‌ సంఘం ఉపాధ్యక్షుడు అందె బాబయ్య, నాయకులు పెద్ద విజయ్‌, సత్యనారాయణ, పుట్టా బాలరాజు, జిల్లా ముదిరాజ్‌ సంఘం మాజీ సర్పంచ్‌ చీర్ల శ్రీనివాసులు, గ్రామ కమిటీ సభ్యులు గాండ్ల రాము, యుగంధర్‌, నాగన్న, జనార్దన్‌, నరేందర్‌, కురుమూర్తి, పరశురాం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement