కొందరికే పంపిణీ చేశారు.. | - | Sakshi
Sakshi News home page

కొందరికే పంపిణీ చేశారు..

Oct 24 2026 12:34 AM | Updated on Oct 24 2026 12:34 AM

కొందరికే పంపిణీ చేశారు.. పూర్తి బాధ్యత మహిళా సంఘాలదే..

వేరుశనగ సాగు చేయాలని పొలం సిద్ధం చేశాం. ప్రభుత్వం నుంచి వందశాతం రాయితీపై విత్తనాలు అందిస్తున్నారని తెలిసి మహిళా సంఘం వారిని అడిగినా ఇవ్వలేదు. మా ఊర్లో 13 మంది రైతులకు మాత్రమే ఇచ్చారు. అందరికీ ఇవ్వడం కుదరదని చెబుతున్నారు. మండలానికి మొత్తం 140 క్వింటాళ్ల విత్తనాలు మాత్రమే వచ్చాయని చెబుతున్నారు. పంట సాగు చేసే రైతులకు ఇస్తే బాగుంటుంది.

– కల్వకోలు శ్రీనివాస్‌రెడ్డి,

ఉప్పరిపల్లి, ఖిల్లాఘనపురం

కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. మహిళా సంఘాల్లోని సభ్యులు, ఏటా వేరుశనగ సాగు చేసే రైతు కుటుంబాల మహిళలతో ఎఫ్‌పీజీలను ఎంపికచేసి వారి సారథ్యంలోనే అర్హుల ఎంపిక, విత్తనాల పంపిణీ చేయించాల్సి ఉంది. జిల్లాకు ఇచ్చిన ఇండెంట్‌ ప్రకారం విత్తనాలు తెప్పించి వారికి అప్పగించే వరకే మా పాత్ర. కాని ఉన్నతాధికారుల సూచన మేరకు పంపిణీని పర్యవేక్షించి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం పంపిణీ చేస్తున్న విత్తనాలు గిర్‌–4, 5 రకాలు. వనపర్తి ప్రాంతంలోని రైతులు ఎక్కువగా కే–6, ట్యాగ్‌ రకాల విత్తనాలు వేస్తారు. ఈ రెండు రకాల మధ్య వ్యత్యాసం ఉంటుంది. రైతులు ముందుకొచ్చి సాగు చేస్తామంటేనే ప్రోత్సాహకం ఉంటుంది. – ఆంజనేయులు,

జిల్లా వ్యవసాయ అధికారి

●

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement