గడువులోగా భూ రీ–సర్వే పూర్తిచేయాలి | - | Sakshi
Sakshi News home page

గడువులోగా భూ రీ–సర్వే పూర్తిచేయాలి

Oct 24 2026 12:34 AM | Updated on Oct 24 2026 12:34 AM

వనపర్తి: జిల్లాలో కొనసాగుతున్న భూ రీ–సర్వే పారదర్శకంగా, కచ్చితత్వంతో నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. గోపాల్‌పేట మండలం చెన్నూరులో కొనసాగుతున్న భూ రీ–సర్వే పనులను శుక్రవారం ఆయన పరిశీలించి సరిహద్దుల గుర్తింపు, భూముల వివరాల నమోదు, సంబంధిత పత్రాల నిర్వహణ ప్రక్రియను తనిఖీ చేశారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ క్షేత్రస్థాయిలో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని సర్వే సిబ్బందికి సూచించారు. సరిహద్దుల గుర్తింపు, రికార్డుల నమోదు తదితర అంశాల్లో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనంతరం జిల్లాకేంద్రంలోని కేడీఆర్‌ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రాంగణంలోని ప్రభుత్వ బీసీ బాలుర వసతిగృహాన్ని సందర్శించి గదులు, వంటగది, ఇతర మౌలిక వసతులను తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న భోజన నాణ్యత, మెనూ అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. వారి తో కలిసి నేలపై కూర్చొని మధ్యాహ్న భోజనం చేశారు. వసతిగృహ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, ముఖ్యంగా చేతులు కడుక్కునే ప్రాంతంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపర్చాలని సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం, శుభ్రత విషయంలో నిర్లక్ష్యం సరికాదన్నారు. తదుపరి ఎంజేపీటీబీసీ వ్యవసాయ డిగ్రీ కళాశాలను సందర్శించి కళాశాలలో విద్యాబోధన, విద్యార్థు లకు కల్పిస్తున్న వసతులను పరిశీలించారు. విద్యా ప్ర ణాళికలు, పరీక్షలకు సన్నద్ధత, భవిష్యత్‌ లక్ష్యాలను అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు. నాణ్యమై న విద్య, పౌష్టికాహారం అందించాలని యాజమాన్యానికి సూచించారు. వసతి గృహాల్లో సదుపాయాలు, పరిశుభ్ర వాతావరణాన్ని కల్పించాలన్నారు. సంబంధి త మండలాల రెవెన్యూ సిబ్బంది, సర్వే అధికారులు, వసతిగృహ సంక్షేమ అధికారులు, కళాశాల సిబ్బంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement