జాప్యమెందుకో..?! | - | Sakshi
Sakshi News home page

జాప్యమెందుకో..?!

Oct 17 2026 1:04 AM | Updated on Oct 17 2026 1:04 AM

గద్వాల: నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో ప్రధానమైన ర్యాలంపాడు రిజర్వాయర్‌ మరమ్మతుకు నోచుకోవడం లేదు. నాలుగేళ్ల కిందట ఆనకట్ట, తూముల వద్ద లీకేజీలు ఏర్పడ్డాయి. ఫలితంగా 4 టీఎంసీల నీటి సామర్థ్యం ఉన్న రిజర్వాయర్‌ కాస్త 2 టీఎంసీలు మాత్రమే నిల్వ చేస్తున్నారు. దీంతో ర్యాలంపాడు జలాశయం కింద 1.12 లక్షల ఎకరాల ఆయకట్టుకు కేవలం ఖరీఫ్‌లో ఒకే పంటకు సాగునీరు అందుతుండగా.. రబీ సీజన్‌లో క్రాప్‌ హాలిడే ఇస్తున్నారు. దీంతో తక్షణమే మర్మమతు చేయాలని రైతులు ఏటా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.4.92 కోట్లు మంజూరు చేసింది. అయితే పలుమార్లు హైదరాబాద్‌, పుణెల నుంచి ఇంజినీరింగ్‌ నిపుణుల బృందం రిజర్వాయర్‌ను సందర్శించి సర్వే చేశారు. మరమ్మతు చేసేందుకు ముందస్తుగా 7 రకాల శాంపిల్స్‌ సేకరించి నివేదిక కోసం హైదరాబాద్‌లోని టీఎస్‌ఈఆర్‌ఎల్‌ (తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగ్‌ రీసెర్చి ల్యాబ్‌)కు పంపారు. వీరు ఇచ్చే నివేదికను పుణెకు చెందిన సీడబ్ల్యూపీఆర్‌సీ ల్యాబ్‌కు పంపించి అక్కడి నుంచి వచ్చే తుది నివేదిక ఆధారంగా పూర్తిస్థాయి రిపేర్లు చేయాల్సి ఉంటుంది. దీనిపై గత రెండు నెలలుగా ఎలాంటి నివేదిక రాలేదు. దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించడం లేదన్న చందంగా ప్రభుత్వం నుంచి రూ.4.92 కోట్ల నిధులు మంజూరైనా రీసెర్చి ల్యాబ్‌ నుంచి నివేదిక రాకపోవడం మరమ్మతుకు అడ్డంకిగా మారింది. ఇదిలా ఉంటే.. మరోవైపు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గుడ్డెందొడ్డి రిజర్వాయర్‌ స్థాయిని పెంచేందుకు ఆమోదం తెలిపింది. దీని కారణంగానే ర్యాలంపాడుకు మరమ్మతు చేపట్టేందుకు ప్రభుత్వం పునరాలోచనలో పడిందా అన్న ప్రచారం జరుగుతోంది.

2 లక్షల ఎకరాలు..

గద్వాల, అలంపూర్‌ నియోజకవర్గాల్లో సుమారు 2 లక్షల ఎకరాలకు సాగు, తాగునీటిని అందించే లక్ష్యంతో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి నెట్టెంపాడు ఎత్తిపోతల పథకానికి 2005లో శంకుస్థాపన చేశారు. 2009 వరకు ప్రాజెక్టు నిర్మాణ పనులు పరుగులు పెట్టాయి. ఆ తర్వాత మహానేత అకాల మరణంతో పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. అయితే ప్రాజెక్టు పరిధిలో మొత్తం ఏడు రిజర్వాయర్లు (20 టీఎంసీలు) ఉండగా ఇందులో ర్యాలంపాడును 4 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ర్యాలంపాడు రిజర్వాయర్‌ పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్‌ లోపభూయిష్టంగా నిర్మించడం, దానికి తోడు అధికారుల పర్యవేక్షణలో నిర్లక్ష్యం చోటుచేసుకోవడంతో ర్యాలంపాడు రిజర్వాయర్‌కు లీకేజీలు ఏర్పడ్డాయి. రిజర్వాయర్‌ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చిన రెండేళ్లకే ఆనకట్టకు, తూముల నిర్మాణాల్లో లీకేజీలు ఏర్పడ్డాయంటే పనుల నాణ్యత ఏ స్థాయిలో నిర్మించారో అవగతమవుతోంది.

ఏడు రకాల శాంపిల్స్‌..

రిజర్వాయర్‌ మరమ్మతుకు సంబంధించి ఆనకట్టలోని రాక్‌ టోల్‌ లేయర్లు, తూముల అడుగు భాగంలో ఏడు రకాల మట్టి శాంపిల్స్‌ సేకరించారు. వీటిని హైదరాబాద్‌లోని ఇంజినీరింగ్‌ రీసెర్చి ల్యాబ్‌కు పంపారు. ఇక్కడి నుంచి వచ్చిన రిపోర్టును తుది నివేదిక కోసం పుణెకు చెందిన సీడబ్ల్యూపీఆర్‌సీకి పంపనున్నట్లు అధికారులు తెలిపారు. అక్కడి నుంచి వచ్చే తుది నివేదిక ఆధారంగానే రిజర్వాయర్‌కు పూర్తిస్థాయిలో మరమ్మతు చేపట్టే అవకాశం ఉంది.

జూరాలకు తగ్గిన ఇన్‌ఫ్లో

అమరచింత: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో పూర్తిగా తగ్గింది. శుక్రవారం కేవలం 300 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైనట్లు ప్రాజెక్టు ఏఈ సుదర్శన్‌ తెలిపారు. గురువారం నాటికి నారాయణపూర్‌ డ్యాం నుంచి రోజువారీగా 5వేల క్యూసెక్కుల నీరు నాలుగు రోజుల పాటు రావడం.. ఆపై 1,000 క్యూసెక్కుల నీరు రెండు రోజులపాటు వచ్చినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఇన్‌ఫ్లో పూర్తిగా తగ్గిందన్నారు. జూరాలపై ఆధారపడిన ఎత్తిపోతల పథకాలతో పాటు ఆర్డీఎస్‌ లింక్‌ కెనాల్‌, సమాంతర కాల్వ, భీమా ఫేజ్‌–2కు పూర్తిగా నీటి సరఫరాను నిలిపివేశారు. అదే విధంగా జూరాల ఆయకట్టుకు నాలుగు రోజులుగా సాగునీటి విడుదల నిలిచిపోయింది.

ఏజెన్సీలతో సర్వే..

ర్యాలంపాడు రిజర్వాయర్‌కు లీకేజీ ఏర్పడిన అనంతరం మరమ్మతు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. మొదట రూ.60 లక్షలతో హైదరాబాద్‌కు చెందిన ఏజెన్సీకి సర్వే పనులు అప్పగించింది. ఆరు నెలలపాటు సర్వే చేసిన సదరు ఏజెన్సీ తుది నివేదికను గత ప్రభుత్వానికి సమర్పించింది. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో మరోసారి పుణెకు చెందిన ఇంజినీరింగ్‌ బృందంతో సర్వే చేయించింది. పుణె ఇంజినీరింగ్‌ నిపుణుల బృందం రెండుసార్లు రిజర్వాయర్‌ను సందర్శించి.. తుది నివేదిక ప్రభుత్వానికి సమర్పించారు.

ర్యాలంపాడ్‌ జలాశయ మరమ్మతుల్లో తీవ్ర అలసత్వం

ఆనకట్ట, తూముల రిపేర్‌ కోసం రూ.4.92 కోట్లు మంజూరు

టీఎస్‌ఈఆర్‌ఎల్‌ నివేదిక

ఆలస్యమే కారణమా..?

ఏదేమైనా పుణె సీడబ్ల్యూపీఆర్‌సీ నివేదిక వస్తేనే ముందుకు..

సాగునీటి ఇబ్బందులతో ఆయకట్టుకు యాసంగిలో క్రాప్‌ హాలీడే ప్రకటన

ప్రభుత్వం మంజూరు చేసిన మొత్తం నిధులు

రూ.4.92 కోట్లు

మరమ్మతుకు వెచ్చించే నిధులు

రూ.3.66 కోట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement