బతుకమ్మ సంబరాల్లో మహిళా పోలీసు సిబ్బందితో ఎస్పీ సునీతారెడ్డి
వనపర్తి: జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ డి.సునీతారెడ్డి మహిళా పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి వేపకాయల బతుకమ్మను రంగురంగుల పూలతో వేపుగా పేర్చి.. తమలపాకులలో గౌరమ్మని పెట్టిన అనంతరం ఆడబిడ్డలు అల్లిన రంగవల్లుల నడుమ బతుకమ్మ వేడుకలను సంబురంగా నిర్వహించారు. చిత్తూ చిత్తుల బొమ్మ.. శివుని ముద్దుగుమ్మ, ఒక్కేసి పువ్వేసి చందమామ అంటూ ఆడి పాడారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఏఆర్ వీరారెడ్డి, డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీనాయక్, డీఎస్పీ గిరిబాబు, సీఐలు ఓడి రమేశ్, రత్నం, అప్పలనాయుడు, శ్రీనివాస కుమార్ తదితరులు పాల్గొన్నారు.


