జిల్లాలోని రేవల్లి మండలం శానాయిపల్లికి చెందిన మండ్ల పార్వతమ్మ, నాగయ్యకు మూడు ఎకరాల పొలం ఉంది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వ్యవసాయంతో పాటు జేసీబీ ఆపరేటర్‌గా, పాలు అమ్మి వచ్చిన డబ్బులతో పిల్లలను కష్టపడి చదివించారు. పెద్ద కుమార్తె బీఈడీ పూర్తి చేయగా.. ఐదేళ్ల కిందట పెళ్లి చేసి అత్తారింటికి పంపించారు. రెండో కుమార్తె కవిత గ్రూప్–1లో 48వ ర్యాంకు సాధించి డీఎస్పీగా ఎంపికై ప్రస్తుతం హైదరాబాద్‌లోని తెలంగాణా పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతోంది. వచ్చే నెల 9న పాసింగ్‌ఔట్ పరేడ్‌తో ట్రైనింగ్ ముగియనుంది. కవిత ఏడోతరగతి వరకు గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాల, 8 నుంచి పదోతరగతి వరకు నాగర్‌కర్నూల్ జెడ్పీ ఉన్నత పాఠశాల, బాసర ఐఐఐటీలో ఇంజినీరింగ్ పూర్తి చేసింది. 2019లో విద్యుత్ ఏఈగా ఎంపికై పెబ్బేరులో పదినెలల పాటు ఉద్యోగం చేసింది. గ్రూప్–1 రాసి 48వ ర్యాంకు సాధించి ప్రస్తు తం ట్రైనింగ్‌లో ఉంది. ఇంత సాధించిన తమ రెండో కూతురును చూ సి తల్లిదండ్రులు గర్విస్తున్నారు.
కవిత తల్లితండ్రులు పార్వతమ్మ, నాగయ్య


