నాన్న నమ్మకమే
నాకు బలమైంది..
మదనాపురం మండలం తిరుమలాయపల్లికి చెందిన బోయిని వెంకటన్నది నిరుపేద కుటుంబం. రోజువారీ కూలీ చేస్తే తప్ప పూట గడవని పరిస్థితి. తన పేదరికం కూతురు మమత చదువుకు అడ్డంకి కాకుండా చూసుకున్నారు. చదువే విజయాలకు అసలైన ఆయుధమని నమ్మారు. తండ్రి పడుతున్న శ్రమను కళ్లారా చూసిన కుమార్తె ఆయన ఆశయాలకు అనుగుణంగా కష్టపడి చదివి ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసింది. నేడు హైదరాబాద్ జిల్లా కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు.
మా నాన్న కష్టం ముందర ఏదీ ఎక్కువ కాదు. మేము చదువుకునేటప్పుడు ఆర్థిక ఇబ్బందులున్నా.. ఏనాడూ మమ్మల్ని నిరాశపర్చలేదు. కూలీ పనికి వెళ్తూనే ఉన్నత చదువులు చదివించారు. ఈ రోజు నేను లాయర్‌గా నిలబడ్డానంటే అది మా నాన్న పడ్డ కష్టం, ఆయన ఇచ్చిన ప్రోత్సాహమే.
– బోయిని మమత, న్యాయవాది


