ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం.. | - | Sakshi
Sakshi News home page

ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం..

Sep 27 2026 12:46 AM | Updated on Sep 27 2026 12:46 AM

ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం..

రజాకార్లను ఎదురించి తరిమికొట్టిన వీర వనిత, పోరాట యోధురాలు, ధైర్యశాలిగా చాకలి ఐలమ్మ చరిత్రలో నిలిచిపోయారని ఎస్పీ సునీతారెడ్డి అన్నారు. శనివారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో నిర్వహించిన చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో ఆమె పాల్గొని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతాంగ హక్కుల కోసం ఆమె చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని, భూమిపై హక్కు సామాజిక న్యాయం, సమానత్వం కోసం పోరాడిన తొలి మహిళా ఉద్యమ నేతల్లో చాకలి ఐలమ్మ ఒకరన్నారు. అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె పోరాటం చేశారని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ ఏఆర్‌ వీరారెడ్డి, ఏవో సునంద, ఎస్బీ సీఐ నరేష్‌, ఆర్‌ఐ అడ్మిన్‌ అప్పలనాయుడు, ఆర్‌ఎస్‌ఐ వినోద్‌ మొగ్ధుంబారి, ఆఫీస్‌ సూపరింటెండెంట్లు ఇంతియాజ్‌, శంకర్‌లాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement