జాతీయ చెస్ పోటీలకు జిల్లా క్రీడాకారుడు
వనపర్తిటౌన్: సౌత్‌జోన్ ఆలిండియా చెస్ పోటీలకు జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడాకారుడు బి.జితేందర్ ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ రఘునందన్ బుధవారం తెలిపారు. బీఎస్సీ బీజెడ్‌సీ తృతీయ సంవత్సరం చదువుతున్న జితేందర్ పాలమూరు విశ్వవిద్యాలయ పరిధిలో 23వ తేదీన జరిగిన అఖిల భారత విశ్వవిద్యాలయ చెస్ పోటీలో రెండోస్థానంలో నిలిచి భారతి దాసన్ విశ్వవిద్యాలయం, తమిళనాడులో జరిగే సౌత్‌జోన్ ఆలిండియా పోటీలకు అర్హత సాధించారని వివరించారు. ఈ పోటీలు మార్చి 2 నుంచి 6వ తేదీ వరకు కొనసాగుతాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారుడిని ప్రిన్సిపాల్, ఫిజికల్ డైరెక్టర్ డా. వి.రాఘవేంద్ర అభినందించారు.


