మెళకువలు పాటిస్తే అధిక లాభాలు | - | Sakshi
Sakshi News home page

మెళకువలు పాటిస్తే అధిక లాభాలు

Feb 26 2026 9:33 AM | Updated on Feb 26 2026 9:33 AM

మెళకువలు పాటిస్తే  అధిక లాభాలు

మెళకువలు పాటిస్తే అధిక లాభాలు

మదనాపురం: మత్స్యకారులు చేపల పెంపకంలో శాసీ్త్రయ మెళకువలు పాటిస్తే ఆర్థికంగా నిలదొక్కుకోగలరని ఖమ్మం జిల్లా పాలేరు ఫిషరీస్‌ రీసెర్చ్‌ స్టేషన్‌ శాస్త్రవేత్తలు సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో ఎన్‌ఎస్‌ ప్యాడ్‌ దిశ ప్రాజెక్టులో భాగంగా ‘మంచినీటి చేపలు.. వ్యాధులు నివారణ’ అనే అంశంపై ఒకరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించగా.. పాలేరు ఫిషరీస్‌ రీసెర్చ్‌ స్టేషన్‌ శాసీ్త్రయ సిబ్బంది రవీందర్‌, డా. అరుణ్‌, నాగరాజు, దివ్య హాజరై మత్స్యకారులకు పలు సూచనలు చేశారు. ముఖ్యంగా చెరువుల్లో నీటి నాణ్యత, బయో సెక్యూరిటీ (జీవ భద్రత) చర్యలు, చేపలకు సోకే వివిధ రకాల వ్యాధుల గురించి వివరించారు. కేవీకే సీనియర్‌ శాస్త్రవేత్త రాజేంద్రకుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. శిక్షణ కార్యక్రమాలు రైతుల ఉత్పాదకతను పెంపొందించడానికి ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. ఆధునిక పద్ధతుల్లో చేపల ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ లాభదాయకమైన ఆక్వాకల్చర్‌ వైపు అడుగులు వేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 37 మంది క్రియాశీల చేపల రైతులు, మత్స్యకారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement