ఆర్భాటాలతో అప్పుల పాలు కావద్దు : మంత్రి | - | Sakshi
Sakshi News home page

ఆర్భాటాలతో అప్పుల పాలు కావద్దు : మంత్రి

Feb 26 2026 9:33 AM | Updated on Feb 26 2026 9:33 AM

ఆర్భా

ఆర్భాటాలతో అప్పుల పాలు కావద్దు : మంత్రి

వీపనగండ్ల: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో నిబంధనలను విస్మరించి ఆర్భాటాలకు వెళ్లి అప్పులపాలు కావద్దని రాష్ట్ర ఎకై ్సజ్‌, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు లబ్ధిదారులకు సూచించారు. బుధవారం మండలంలోని సంగినేనిపల్లి, కల్వరాలలో ఇందిరమ్మ ఇళ్లతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన భూమిపూజ చేసి మాట్లాడారు. గత ప్రభుత్వం చేసిన అప్పులతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకున్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నామని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజాప్రతినిధులు, ప్రజలు సమన్వయంతో వ్యవహరించినప్పుడే గ్రామాలు అభివృద్ధి పథంలో పయనిస్తాయని చెప్పారు. కల్వరాలలో నెలకొన్న నీటిఎద్దడిని సత్వరమే పరిష్కరించాలని ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ వరలక్ష్మి, ఎంపీడీఓ శ్రీనివాసరావు, జిల్లా పర్యాటకశాఖ అధికారి నర్సింహ, సర్పంచ్‌లు పల్ల జయంతి, బండారి రాముడు, బలుస రామన్‌గౌడ్‌ పార్టీ నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

మొదటిరోజు ప్రశాంతం

వనపర్తి టౌన్‌: జిల్లాలో ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. జిల్లావ్యాప్తంగా తొలిరోజు పరీక్షలకు 6,503 మంది విద్యార్థులకుగాను 6,280 మంది హాజరుకాగా.. 223 మంది గైర్హాజరయ్యారు. ఇందులో జనరల్‌ విద్యార్థులు 5,224 మంది విద్యార్థులకుగాను 5,039 మంది హాజరుకాగా.. 185 మంది పరీక్షలు రాయలేదు. అలాగే ఒకేషనల్‌ విద్యార్థులు 1,279 మంది విద్యార్థులకు 1,241 మంది హాజరుకాగా.. 38 మంది గైర్హాజరయ్యారు. కేంద్రాల వద్ద పోలీస్‌ బందోబస్తు నిర్వహించారు. గురువారం రెండో సంవత్సరం విద్యార్థులకు మొదటి రోజు పరీక్ష జరగనుంది.

మాస్‌కాపీయింగ్‌కు తావివ్వొద్దు..

పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని బాలికల జూనియర్‌ కళాశాల పరీక్ష కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి చీఫ్‌ సూపరింటెండెంట్‌కు పలు సూచనలు చేశారు. విద్యార్థుల హాజరు వివరాలను డీఐఈఓ ఎర్ర అంజయ్యను అడిగి తెలుసుకున్నారు. మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని, ప్రభుత్వ నిబంధనలు కచ్చితంగా పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని సూచించారు. విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతించే ముందు క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, మొబైల్‌ ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, ఎలక్ట్రానిక్‌ పరికరాలను తీసుకెళ్లకుండా చూడాలన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ యాదయ్య, డీఐఈఓ ఎర్ర అంజయ్యతో కలిసి స్థానిక జాగృతి కళాశాలను పరిశీలించి పరీక్షల నిర్వహణ తీరును, ఏర్పాట్లపై ఆరా తీశారు. కలెక్టర్‌ వెంట ఆర్డీఓ సుబ్రమణ్యం, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఆర్భాటాలతో అప్పుల పాలు కావద్దు : మంత్రి 1
1/2

ఆర్భాటాలతో అప్పుల పాలు కావద్దు : మంత్రి

ఆర్భాటాలతో అప్పుల పాలు కావద్దు : మంత్రి 2
2/2

ఆర్భాటాలతో అప్పుల పాలు కావద్దు : మంత్రి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement