ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణ ప్రాంతం పరిశీలన
కొల్లాపూర్: మండలంలోని సోమశిల సమీపంలో కృష్ణానదిపై నిర్మించనున్న ఐకానిక్ బ్రిడ్జి ప్రాంతాన్ని కేంద్ర అటవీ శాఖ ఐజీఎఫ్ త్రినాథ్‌కుమార్ శనివారం పరిశీలించారు. జాతీయ రహదారి–167కేతోపాటు బ్రిడ్జి నిర్మాణ కోసం వినియోగించనున్న అటవీ భూముల వివరాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అటవీ భూమికి బదులుగా ప్రభుత్వం అప్పగించే రెవెన్యూ భూముల వివరాలపై వాకబు చేశారు. వీటికి సంబంధించిన రికార్డులను పరిశీలించి.. పరిహారం అంశాలపై చర్చించారు. తాము పరిశీలించిన అంశాలను నివేదిక రూపంలో కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామని ఐజీఎఫ్ త్రినాథ్‌కుమార్ వెల్లడించారు. ఆయన వెంట జిల్లా అటవీ అధికారి రేవంత్‌చంద్ర, ఎఫ్‌డీఓ చంద్రశేఖర్, రేంజర్ ఈశ్వర్, సిబ్బంది కాశన్న, ముజీబ్‌ఘోరీ, శివకుమార్, బయ న్న, నాగార్జున, మహేష్, శ్యాం తదితరులున్నారు.


