అదృష్టంగా భావిస్తాం..
వేణిసోంపురం గ్రామంలో ఉండటం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇక్కడ ప్రతిరోజు మంత్రాలయంలో చేసిన విధంగానే ఆలయ అర్చకులు నిష్టగా పూజలు చేస్తారు. గోకులాష్టమి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపిస్తారు. ఉత్సవాలను కనుల పండువగా నిర్వహిస్తారు. ఈ గ్రామంలో వేణుగోపాలస్వామి వారి ఆలయం ఉండడంతో మా గ్రామానికి ప్రత్యేకత వచ్చింది.
– రవిగౌడ్, వేణిసోంపురం
మాది మారుమూల గ్రామం. గతంలో నదీతీర ప్రాంతంలో మా గ్రామం విసిరివేసినట్లుగా ఉండేది. ఆలయం వెలిసినప్పటి నుంచి మా గ్రామానికి యాత్రికులు వచ్చి వెళ్తున్నారు. దాని వలన మా గ్రామానికి చాలా గొప్ప పేరు వచ్చింది. ఆలయంలో శ్రీకృష్ణుడు కుడికాలుపై ఎడుమకాలు వేసుకొని ఉండడం ఇక్కడి విశిష్టత.
– శ్రీను, వేణిసోంపురం
అదృష్టంగా భావిస్తాం..


