ఓట్లు వేయకుంటే అంతుచుస్తాం | - | Sakshi
Sakshi News home page

ఓట్లు వేయకుంటే అంతుచుస్తాం

Nov 28 2026 1:38 AM | Updated on Nov 28 2026 1:38 AM

మాదకద్రవ్యాల నియంత్రణకు పటిష్ట చర్యలు

● బోడసింగిపేటలో మహిళపై పచ్చమూకల దాడి

● గజపతినగరం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చికిత్సకోసం చేరిన బాధిత మహిళ

● బొండపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు

బొండపల్లి: పంచాయతీ ఎన్నికల్లో తమకు ఓటు వేయకుంటే అంతుచూస్తామని బెదిరించడంతో పాటు ఇంట్లోకి చొరబడి ఒంటరిగా ఉన్న మహిళపై దాడిచేసి తీవ్రంగా గాయాలు చేసిన సంఘటన బొండపల్లి మండలం బోడసింగిపేట గ్రామంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. వైఎస్సార్‌సీపీ మద్దతుదారుగా ఉన్నటువంటి పప్పల లక్ష్మి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయం చూసి టీడీపీ మద్దతుదారులు బెదిరింపులకు దిగారు. ఓటు వేయకుంటే అంతుచూస్తామని హెచ్చరించారు. విషయం తెలుసుకున్న లక్ష్మి భర్త వెంకటరమణ ఇంటికి చేరుకోవడంతో అక్కడ నుంచి పచ్చమూకలు వెళ్లి పోయారు. దాడికి గురైన లక్ష్మిని గజపతినగరంలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆమెను వైఎస్సార్‌సీపీ యువజన విభాగం మండలాధ్యక్షుడు బోడసింగి జగదీశ్వరరావు పరామర్శించారు. బొండపల్లి పోలిస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

గిరిజన విద్యార్థి మృతి

సీతంపేట: సీతంపేట గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న సవర విజయ్‌నందన్‌ (12) పచ్చకామెర్లతో బాధపడుతూ శ్రీకాకుళం రిమ్స్‌లో శుక్రవా రం మృతిచెందాడు. ఈ నెల 23న కడుపునొప్పి తీవ్రంగా రావడంతో పాఠశాల సిబ్బంది, కుటుంబ సభ్యులు సీతంపేట ఏరియా ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం వైద్యులు శ్రీకాకుళం రిమ్స్‌కు రిఫర్‌ చేశారు. పాలకొండ సబ్‌కలెక్టర్‌, ఐటీడీఏ ఇన్‌చార్జి పీఓ పవార్‌ స్వప్నిల్‌ అక్కడి వైద్యులతో మాట్లాడి శస్త్ర చికిత్స చేయించారు. అనంతరం బాగానే ఉంది. దీంతో అక్కడే ఉండి వైద్యసేవలు పొందుతున్నాడు. గురువారం ఊహించని విధంగా ప్లేట్‌లెట్స్‌, పల్స్‌ పడిపోవడంతో అపస్మారక స్థితికి చేరాడు. వైద్యసేవలు అందించినా ఫలితం లేకపోయింది. విద్యార్థిది సీతంపేట మండలంలోని నౌగూడ గ్రామం. తల్లిదండ్రులు శ్రీను, కుమారి వ్యవసాయకూలి పనులుచేస్తూ జీవనం సాగిస్తున్నారు. పెద్దకుమార్తె డిగ్రీ చదువుతోంది. చిన్నకుమారుడు మృతితో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. హెచ్‌ఎం టి.చంద్రరావు, డిప్యూటీ వార్డె న్‌ బెన్నయ్య, ఉపాధ్యాయ సిబ్బంది కుటుంబాన్ని పరామర్శించి మృతునికి కుటుంబానికి దహన సంస్కారాల ఖర్చుల కింద రూ.5వేలు చెల్లించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో విద్యార్థుల మరణాలపై విద్యార్థి, గిరిజన సంఘాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.

ఈవీఎంల గొడౌన్‌ తనిఖీ

పార్వతీపురం రూరల్‌: కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిబంధనల ప్రకారం జిల్లా కేంద్రంలోని ఈవీఎం, వీవీప్యాట్‌ భద్రతా గొడౌన్‌ను కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.ప్రభాకర రెడ్డి శుక్రవారం తనిఖీ చేశారు. సీసీటీవీ నిఘా వ్యవస్థ, పోలీస్‌ బందోబస్తు, సంబంధిత రిజిస్టర్లను కలెక్టర్‌ పరిశీలించారు. గొడౌన్‌లో తగినంత గాలి, వెలుతురు ఉండేలా చూడాలని, తేమ చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్వో కె.హేమలత, పార్వతీపురం సబ్‌ కలెక్టర్‌ సచిన్‌ అచ్చితా రహార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ రాంగోపాల్‌, తహసీల్దార్‌, రెవెన్యూ, ఎన్నికల విభాగానికి చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

పార్వతీపురం: జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణతో పాటు గంజాయి, మాదక ద్రవ్యా ల అక్రమ రవాణా, విక్ర యాలను అరికట్టేందుకు అన్నిశాఖలు సమన్వయంతో పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.ప్రభాకరరెడ్డి, ఎస్పీ ఎస్‌.వి.మాధవ్‌రెడ్డి ఆదేశించారు. అధికారులతో శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆపరేషన్‌ త్రిశూల్‌, ఎన్‌కార్డ్‌ కార్యక్రమాల అమలుపై సమీక్షించారు. ఈగల్‌ క్లబ్‌లను చురుగ్గా పనిచేయించాలని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement